అయోధ్యపై తీర్పు మోదీ ప్రసంగం: ‘కలపడం, కలవడం, కలసికట్టుగా జీవించడం.. ఇదే నవంబర్ 9 సందేశం’
అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకు చెందుతుందని సుప్రీంకోర్టు తుది తీర్పు చెప్పింది. ముస్లింలకు అయోధ్యలోనే మరో చోట 5 ఎకరాలు కేటాయించాలని ఆదేశించింది.
లైవ్ కవరేజీ
బెర్లిన్ గోడను ఎందుకు కూల్చేశారు? ఆ ప్రకటన వెలువడ్డాక ప్రజలు ఏంచేశారు?
నవంబర్ 9వ తేదీనే బెర్లిన్ గోడ కూలిందని ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చెప్పారు. ఈ నేపథ్యంలో బెర్లిన్ గోడను ఎందుకు కూల్చేశారు? ఆ ప్రకటన వెలువడ్డాక ప్రజలు ఏంచేశారు? ఈ వీడియోలో చూడండి.
వీడియో క్యాప్షన్, బెర్లిన్ గోడను ఎందుకు కూల్చేశారు?
బెర్లిన్ గోడను ఎందుకు కట్టారు?
నవంబర్ 9వ తేదీనే బెర్లిన్ గోడ కూలిందని ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చెప్పారు.
ఈ నేపథ్యంలో అసలు బెర్లిన్ గోడను ఎందుకు కట్టారు? అన్నది ఈ వీడియోలో చూడండి.
వీడియో క్యాప్షన్, బెర్లిన్ గోడ నిర్మాణానికి కారణాలు ఏమిటి?
‘నవతరం ‘న్యూ ఇండియా’ని నిర్మిస్తుంది’
అయోధ్య వివాదం అనేక తరాలను ప్రభావితం చేసిందని, అయితే, సుప్రీం కోర్టు తీర్పు మనకు నవోదయాన్ని తీసుకొచ్చిందని మోదీ అన్నారు. ఈ తీర్పు తరువాత, ఇప్పుడు నవతరం నవభారతాన్ని కొత్త మార్గంలో నిర్మించడం ప్రారంభిస్తుందని, నవభారతంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
‘ఈరోజే బెర్లిన్ గోడ కూలింది’
నవంబర్ 9నే బెర్లిన్ గోడ కూలి రెండు ప్రాంతాలు కలసిపోయాయిని ప్రధాని గుర్తు చేశారు. ‘‘ఈరోజు కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమైంది. ఇందులో భారత్, పాక్ పాత్ర ఉంది. నవంబర్ 9న, అయోధ్య తీర్పు వెలువడింది. ‘కలపడం, కలవడం, కలసికట్టుగా జీవించడం.. ఇదే నవంబర్ 9 సందేశం’’ అని మోదీ అన్నారు.
అయోధ్య తీర్పుపై మోదీ: ‘చరిత్రలో ఈరోజు కొత్త అధ్యాయం మొదలైంది’
అయోధ్య వివాదం విషయంలో
సుప్రీం కోర్టు తీర్పును దేశమంతా స్వాగతిస్తోందని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. తీర్పు
అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.
భారత దేశ న్యాయ
చరిత్రలో ఈ రోజు సువర్ణాధ్యాయమని, అయోధ్య కేసులో దశాబ్దాలుగా
సాగిన న్యాయ ప్రక్రియ ముగిసిందని పేర్కొన్నారు.
‘‘భిన్నత్వంలో
ఏకత్వం అనే మూలమంత్రం ఇవ్వాళ సంపూర్ణత్వంతో వికసించింది. భారత్ అతిపెద్ద
ప్రజాస్వామ్య దేశమని ప్రపంచమంతా గుర్తించింది. మనమంతా ఐక్యంగా కలిసే తరుణమిది. నవభారతంలో
భయానికి తావులేదు. మహోన్నత తీర్పును ఈ రోజు సుప్రీం కోర్టు వెలువరించింది. తీర్పునిచ్చిన
న్యాయమూర్తులకు అభినందనలు. అందర్ని ఒప్పించడం అంతసులువైన విషయం కాదు. దశాబ్దాలుగా
సాగిన న్యాయ ప్రక్రియ ముగిసింది. చరిత్రలో ఈరోజు కొత్త అధ్యాయం మొదలైంది.’’ అని
తెలిపారు.
ఫొటో సోర్స్, ani
ఫొటో క్యాప్షన్, మోదీ
‘కలపడం, కలవడం, కలసికట్టుగా జీవించడం.. ఇదే నవంబర్ 9 సందేశం’
‘కలపడం, కలవడం, కలసికట్టుగా జీవించడం.. ఇదే నవంబర్ 9 సందేశం’ అని మోదీ అన్నారు.
ఫొటో సోర్స్, DD News
అయోధ్య తీర్పుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం
అయోధ్య తీర్పుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం
కలసికట్టుగా జీవించాలన్నదే నవంబర్ 9వ తేదీ సందేశం
‘‘బెర్లిన్ గోడను కూల్చిన రోజు ఇది. ఇదే రోజు కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభమైంది. ఇందులో భారత్, పాకిస్తాన్‌ల భాగస్వామ్యం ఉంది. నవంబర్ 9వ తేదీ సందేశం ఏంటంటే.. కలసికట్టుగా జీవించాలన్నదే’’ - నరేంద్ర మోదీ
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
ఫొటో సోర్స్, DD News
తీర్పును స్వాగతిస్తున్నాం: షాహి ఇమామ్
అయోధ్య కేసుపై సుప్రీం
కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని దిల్లీకి చెందిన జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్
బుఖారీ తెలిపారు. దేశం అభివృద్ధి దిశగా సాగుతుందని ఆశిస్తున్నామని, ఈ విషయంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడాన్ని అంగీకరించమని తెలిపారు.
ఫొటో సోర్స్, ani
ఫొటో క్యాప్షన్, ఇమామ్ సయ్యద్ అహ్మద్
హిందువుల తరఫున వాదించిన కేకే ఎవరు?
అయోధ్య కేసు విషయంలో రామ్‌లాలా విరాజామన్ తరపున సీనియర్ న్యాయవాది
కె.కె. పరాశరన్వాదనలు
వినిపించారు. పరాశరన్‌కు ఇప్పుడు 93 ఏళ్లు. రాముడు కోసం తన యువ బృందంతో ఆయన సుప్రీంకోర్టులో
వాదించారు.
1967 అక్టోబర్ 9న తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించిన పరాశరన్
తమిళనాడు అడ్వొకేట్ జనరల్ గా పనిచేశారు. భారత అటార్నీ జనరల్‌గానూ పనిచేశారు.2012 నుంచి 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
ఫొటో సోర్స్, twitter
ఫొటో క్యాప్షన్, కేకే పరాశరన్
అయోధ్య తీర్పుపై పాక్ స్పందన ఏమిటి?
అయోధ్య వివాదంపై భారత
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పాకిస్తాన్ స్పందించింది.
పాకిస్తాన్ ఆర్మీ అధికార
ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేస్తూ, "ప్రపంచం మరోసారి అతివాద భారత్ నిజరూపాన్ని
చూసింది’’ అని ట్వీట్ చేశారు.
‘‘ఆగస్టు 5న కశ్మీర్ రాజ్యాంగ
హోదాను భారత్ తొలగించింది. ఇప్పుడు బాబ్రీ మసీదుపై తీర్పునిచ్చింది. మరోవైపు, పాక్ మాత్రం ఇతర మతాలను గౌరవిస్తూ గురునానక్ సేవకుల కోసం కర్తార్‌పూర్ కారిడార్‌ను
ప్రారంభించింది’’ అని పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
సుప్రీంకోర్టు తీర్పును
తాము స్వాగతిస్తున్నామని, వినయంగా అంగీకరిస్తున్నామని ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్
వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జాఫర్ ఫరూఖీ తెలిపారు.
‘‘అత్యున్నత
న్యాయస్థానం ఉత్తర్వును సమీక్షించడానికి రివ్యూ పిటిషన్ కానీ, క్యురేటివ్ పిటిషన్ కానీ దాఖలు చేయడానికి
యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు వెళ్లదని స్పష్టం చేస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఐదు ఎకరాల స్థలం అవసరం లేదు: ఓవైసీ
ముస్లిం పక్షానికి
ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలన్న సుప్రీం తీర్పుతో ఓవైసీ విభేదించారు.
ఇంకా ఆయన
ఏమన్నారంటే...
·మా చట్టపరమైన హక్కుల కోసం మేం పోరాడుతున్నాం.
ముస్లింలు పేదలు, వారిపై వివక్షత ఉంది. మాకు ఉద్దీపనలు, భిక్ష అవసరం లేదు.
·ముస్లిం పర్సనల్ లా బోర్డు 5 ఎకరాల స్థలాన్ని
అంగీకరిస్తుందో లేదో చూడాలి, ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని నా వ్యక్తిగత అభిప్రాయం.
·హిందూ రాష్ట్ర మార్గంలో దేశం వెళుతోంది. అయోధ్య
విషయాన్ని సంఘ్ పరివార్, బీజేపీలు ఉపయోగించుకుంటాయి.
·అక్కడ ఒక మసీదు ఉంది, అలాగే ఉంటుంది.
500 ఏళ్ల నుంచి అక్కడ మసీదు ఉందని మేం మా ముందుతరాలకు చెబుతాం. 1992లో, సంఘ్ పరివార్, కాంగ్రెస్
కుట్ర కారణంగా ఆ మసీదు కూలిపోయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
ఒకవేళ మసీదు కూల్చకపోతే, ఎలాంటి తీర్పు వచ్చేది: ఓవైసీ
రాజీవ్ ధావన్‌తో పాటు సుప్రీంకోర్టులో ముస్లింల పక్షం మాట్లాడిన వారికి కృతజ్ఞతలు
తెలుపుతూ ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సుప్రీం
తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విశ్వాసాలు వాస్తవాలపై విజయం సాధించాయని పేర్కొన్నారు.
‘‘ఆల్ ఇండియా ముస్లిం
పర్సనల్ లా బోర్డ్ మాదిరిగా, మేము కూడా దీనిపై సంతృప్తి చెందడం లేదు. సుప్రీంకోర్టు
సుప్రీం కావొచ్చు కానీ అది దోషరహితమైనది కాదని జస్టిస్ జేఎస్ వర్మ చెప్పారు. 1992 డిసెంబర్
6న బాబ్రీ మసీదును కూల్చివేసిన వారితోనే ఈ రోజు ట్రస్ట్ నిర్మించి ఆలయ పనులను ప్రారంభించాలని
సుప్రీంకోర్టు చెబుతోంది. మసీదు కూల్చివేయకపోతే, కోర్టు ఎలాంటి తీర్పునిచ్చేది’ అని
ప్రశ్నించారు.
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, అసదుద్దీన్ ఓవైసీ
మేం పూర్తి సంతృప్తితో ఉన్నాం- హషీం అన్సారీ కుమారుడు
రామ జన్మభూమి,
బాబ్రీ వివాదాలకు
సంబంధించిన పిటిషనర్ హషీం అన్సారీ కుమారుడు ఇక్బాల్ అన్సారీ తీర్పును
స్వాగతించారు. కోర్టు తీర్పుపై పూర్తిగా సంతృప్తి చెందుతున్నట్లు తెలిపారు.
‘‘మేం 200
శాతం సంతృప్తి చెందాం. కోర్టు
తన నిర్ణయాన్ని సరిచేసుకుంది. ఇంతకుముందు కోర్టును గౌరవించాం, ఈ రోజు కూడా మేం అదే
చేస్తున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించినట్లయితే అది మంచి విషయం అవుతుంది. ప్రభుత్వం
చేసే పనిని మేం అంగీకరిస్తాం. హిందూ, ముస్లిం సోదరులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటన్నా,
ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది, దీన్ని మనం అంగీకరించాలి’’ అని పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, ఇక్బాల్ అన్సారీ
అయోధ్య కేసులో తీర్పు తర్వాత మధురలోని షాహీ ఈద్గా దగ్గర సామాన్యులు
హిందువులు మసీదు నిర్మాణం కోసం సహకారం అందించాలి- బాబా రాందేవ్
తీర్పును గౌరవించండి, సోదరభావాన్ని కాపాడండి: ప్రియాంక గాంధీ
"అయోధ్య అంశంలో భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అన్ని పక్షాలు,
సమాజాలు, పౌరులు ఈ తీర్పును గౌరవిస్తూ శతాబ్దాల నుంచీ కలిసిమెలిసి ఉండే మన
సంస్కృతిని కాపాడాలి. మనందరం ఒక్కటై మన సామరస్యాన్ని, సోదరభావాన్ని బలోపేతం చేయాలి"
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.
పోస్ట్ of X ముగిసింది
తీర్పును గెలుపు-ఓటమిలా చూడద్దు: మోహన్ భగవత్
జాతీయ స్వయం సేవక్
సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఈ తీర్పును స్వాగతిస్తూ అందరూ సంయమనం పాటించాలని కోరారు. గొడవలు-వివాదాలకు ముగింపు పలకాలని సూచించారు. దీనిని గెలుపు-ఓటమిగా చూడకూడదని
అపీల్ చేశారు.
“మనం ఇందులో భాగస్వామ్యం అందించిన సహచరులు,
బలిదానాలను గుర్తుచేసుకుందాం. సోదరభావాన్ని కాపాడేలా ప్రభుత్వ, సామాజిక స్థాయిలో
జరుగుతున్న పూర్తి ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం, వారిని అభినందిస్తున్నాం.
సంయమనంతో న్యాయం కోసం వేచిచూసిన భారత ప్రజలు అభినందనకు అర్హులు. దీనిని గెలుపు-ఓటమిగా
చూడకూడదు. సంయమనంతో మీ ఆనందాన్ని వ్యక్తం చేయండి. గతంలో జరిగిన అన్ని విషయాలూ
మర్చిపోయి, మనందరం శ్రీరామ జన్మభూమిలో గొప్ప ఆలయం నిర్మాణం కోసం మన కర్తవ్యం నిర్వహిద్దాం” అన్నారు.