ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పుల్లేవు
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. వ్యక్తిగత ఆదాయ పన్నుల స్లాబుల్లో ఎలాంటి మార్పులూ లేవు.
అయితే.. గృహ రుణం మీద పన్ను మినహాయింపును మరో రూ. 1.5 లక్షలకు పెంచారు.
అలాగే కొత్తగా విద్యుత్ వాహనాల కొనుగోలు చేయటానికి తీసుకునే రుణం మీదా 1.5 లక్షల వరకూ ఆదాయం మీద పన్ను మినహాయింపు ప్రకటించారు.
ఇక వార్షికాదాయం ఐదు లక్షల లోపు ఉన్న వారు ఎలాంటి ఆదాయ పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదని అల్పాదాయ, మధ్యాదాయ వర్గాల వారికి ఊరటనిచ్చారు.

