SRH vs RR: సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ ఓటమి

హైదరాబాద్ వేదికగా ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. గుజరాత్: ద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు హిందూ సంస్థ మహిళా కార్యకర్తపై కేసు, 50 మందికి పైగా కస్టడీ

    మత ఘర్షణలు

    ఫొటో సోర్స్, ge

    ఉనా నగరంలోని ఒక రైట్ వింగ్ సంస్థకు చెందిన మహిళా కార్యకర్తపై గుజరాత్ పోలీసులు విద్వేషపూరిత ప్రసంగం కేసు నమోదు చేశారు.

    దీనితో పాటు మత అల్లర్లను రెచ్చగొట్టారనే ఆరోపణలతో 50కి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

    ఉనా నగరంలో గురువారం రామ నవమి సందర్భంగా నిర్వహించిన 'హిందూ సమ్మేళనం'లో కాజల్ హిందుస్తానీ అనే మహిళ ప్రసంగించిన తర్వాత మతపరమైన ఉద్రిక్తత తలెత్తింది.

    ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శనివారం రాత్రి నగరంలోని సున్నిత ప్రాంతంలో రెండు గ్రూపులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. దీంతో మత ఘర్షణలు మొదలయ్యాయి.

  3. రాహుల్ గాంధీ: ‘‘అదానీతో ప్రధాని మోదీకి ఉన్న సంబంధం ఏంటి?’’

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Getty Images

    కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి అదానీ కేసు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.

    ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ఒక వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కనిపిస్తున్నారు.

    ‘‘ప్రధానమంత్రి గారూ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి చాలా రోజులైంది. ఇప్పటివరకు మీ నుంచి దానికి జవాబు రాలేదు. అందుకే మరోసారి నేను దాన్ని గుర్తు చేస్తున్నా. అదానీతో మీకు ఉన్న సంబంధం ఏంటి? రూ. 20 వేల కోట్లు ఎవరివి? అదానీ గ్రూపును కాపాడటం కోసం ఎస్‌బీఐ, ఎల్‌ఐసీలకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు?

    మీరు, అదానీతో కలిసి ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు? గత 20 ఏళ్లలో అదానీ, బీజేపీకి ఎంత డబ్బు ఇచ్చారు. మారిషస్‌లోని షెల్ కంపెనీలు ఎవరివి? అదానీ ఈ పనిని ఉచితంగా చేస్తున్నారా?

    నేను ప్రశ్నలు అడగడం మానను. నేను ప్రశ్నించడానికి భయపడను.

    నాపై అనర్హత వేటు వేసి, బెదిరించి, జైలుకు పంపించి నా నోరు మూయించగలనని అనుకుంటున్నారా? అలా జరగదు’’ అంటూ ఆయన వీడియోలో ప్రశ్నిస్తున్నారు?

  4. బ్రేకింగ్ న్యూస్, సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ ఓటమి

    సన్‌రైజర్స్ హైదరాబాద్

    ఫొటో సోర్స్, ANI

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తమ తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టు పరాజయాన్ని ఎదుర్కొంది.

    హైదరాబాద్ వేదికగా ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.

    మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్నీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది.

    ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 54; 9 ఫోర్లు), జోస్ బట్లర్ (22 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ సంజూ శామ్సన్ (32 బంతుల్లో 55; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు.

    రాజస్థాన్ రాయల్స్, సంజూ శామ్సన్

    ఫొటో సోర్స్, ANI

    హెట్‌మైర్ (16 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.

    హైదరాబాద్ బౌలర్లలో ఫరూఖీ, టి. నటరాజన్ చెరో 2 వికెట్లు తీయగా, ఉమ్రాన్ మలిక్ ఒక వికెట్ పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

    అనంతరం 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులే చేయగలిగింది.

    అబ్దుల్ సమద్ (32 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్.

    ప్రత్యర్థి బౌలర్లలో చహల్ 4 వికెట్లతో చెలరేగాడు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీశాడు. జేసన్ హోల్డర్, అశ్విన్‌లకు చెరో వికెట్ దక్కింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  5. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే: రాణి ముఖర్జీ సినిమా పై 'నార్వే' ఎందుకు నిరసన వ్యక్తం చేస్తోంది?

  6. భారీ వర్షాలకు ప్రాణభయంతో విలవిలలాడిన బ్రెజిల్ వాసులు

  7. అఫ్గాన్‌ అమ్మాయిలకు బీబీసీ పాఠాలు

  8. 'మాకు పెళ్లి అవసరం లేదు, ప్రేమ చాలు' -సహజీవనంలో ఉన్న ఓ మహిళ అనుభవాలు

  9. హైదరాబాద్: ఆ 35 ముస్లిం కుటుంబాలు రోడ్డుపైనే రంజాన్ దీక్షలు ఎందుకు చేస్తున్నాయి?

  10. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి: కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ, విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి పోరాడుతామని ప్రకటన

    ktr

    ఫొటో సోర్స్, facebook/ktr

    ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు.

    ఈ లేఖలో ఆయన .. ప్రధాని మోదీ తన కార్పొరేట్ మిత్రులకు రూ. 12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని.. అదే స్థాయి ఔదార్యం విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.

    వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు కేంద్రం కొత్త కుట్ర చేస్తోందని ఆరోపించారు.

    Vizag Steel plant

    ఫొటో సోర్స్, FACEBOOK/RINLLTD

    కేంద్రమే ఈ వర్కింగ్ కాపిటల్ కోసం ఆర్థిక సహాయం అందించి వైజాగ్ స్టీల్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనాలని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ విలీనాన్ని పరిశీలించాలని సూచించారు.

    కేంద్ర ప్రభుత్వమే తక్షణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అవసరమైన మేరకు కనీసం రూ. 5 వేల కోట్ల రూపాయలను వేంటనే కేటాయించాలని సూచించారు.

    గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.

    లక్షన్నర కోట్ల రూపాయల విలువ కలిగిన స్టీల్ ప్లాంట్ ను అప్పనంగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను కేంద్రం ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

    ktr

    ఫొటో సోర్స్, facebook/ktr

    భారత్ రాష్ట్ర సమితి ఒక పార్టీగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలన్న చిత్తశుద్దితో ఉందని కేటీఆర్ అన్నారు.

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగాల భవిష్యత్తును కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వారితో కలిసి పని చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

    ఇందుకోసం కలిసి వచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, పార్టీలతో కలసిప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల హక్కు అని, దాన్ని కాపాడుకోవడం కోసం తెలుగువారందరు కలిసి రావడం అవసరమని భావిస్తున్నామన్నారు.

    ఎన్నో త్యాగాలు, పోరాటాలతో ఏర్పాటైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం కొన్ని స్వార్థపూరిత శక్తులు, వారి ఎజెండాలకు బలి కావొద్దని, ఎట్టిపరిస్థితుల్లో దాన్ని అంగీకరించబోమని మంత్రి కుండబద్దలు కొట్టారు.

    కేంద్ర ప్రభుత్వం లేపిన ఈ సరికొత్త కుట్రను ఎదుర్కొనేందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను కలిసి వారికి సంఘీభావం తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ భారత రాష్ట్ర సమితి శాఖ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ కుకేటీఆర్ సూచించారు.

  11. రాజస్థాన్‌ ఆరోగ్య హక్కు బిల్లులో ఏముంది?

  12. ఈ పాలు లీటరు రూ. 7 వేలు

  13. సముద్రంలోనే నివాసం, శరణార్థులకు ఆవాసంగా విలాసవంతమైన ఓడ

  14. భారత్‌లో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు, కొత్తగా 3,824 నమోదు

    కరోనా కేసులు

    ఫొటో సోర్స్, ANI

    భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

    గత 24 గంటల్లో కొత్తగా 3,824 కరోనా కేసులు నమోదయ్యాయి.

    దీంతో మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 18,389కి పెరిగింది.

    మూడు రోజులుగా కూడా కరోనా కేసుల సంఖ్య రోజుకు 3 వేల చొప్పున నమోదవుతున్నాయి.

  15. బ్రేకింగ్ న్యూస్, మాజీ క్రికెటర్ సలీం దురానీ మృతి

    సలీం దురానీ

    ఫొటో సోర్స్, ICC

    మాజీ క్రికెటర్ సలీం దురానీ మృతి చెందారు. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సలీం దురానీ, ఆదివారం ఉదయం జమ్నానగర్‌లోని తన ఇంట్లో కన్నుమూసినట్లు తెలిసింది.

    ఆయన క్రికెట్ ఆడే సమయంలో సలీం దురానీని భారత్‌లో ఉన్నతమైన ఆల్ రౌండర్‌గా చెప్పేవారు.

    ప్రేక్షకుల కోరిక మేరకు సిక్స్‌లకు కొట్టడంలో ఆయన ఫేమస్.

    సలీం దురానీ మృతిపై వీవీఎస్ లక్ష్మణ్ సంతాపం తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    1973లో భారత్‌ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు దురానీ ఆ టెస్ట్ మ్యాచ్‌లో ఆడలేదు. ఆ సమయంలో ‘నో దురానీ, నో టెస్ట్’ అనే పోస్టర్లు వెలిశాయి.

    భారత్ తరఫున సలీం దురానీ 29 టెస్ట్‌లు ఆడారు. 75 వికెట్లు తీశారు. అలాగే, ఆయన ఆడిన మ్యాచ్‌లలో 1202 పరుగులు తీశారు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యధికంగా 104 పరుగులు చేశారు.

    1961-62లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించడంతో సలీం దురానీ ఫేమస్ అయ్యారు.

    Salim Durani

    ఫొటో సోర్స్, Getty Images

  16. వెర్టిగో : కళ్లు మసకబారి, తల తిరుగుతూ, చెవుల్లో ధ్వనులు వినిపిస్తున్నాయా?

  17. హిజాబ్ ధరించలేదని ఇద్దరు మహిళల తలపై పెరుగు పోశారు

    ఇరాన్ లో మహిళలపై దాడి

    ఫొటో సోర్స్, ugc

    తలపై జుత్తు కనిపించకుండా కప్పుకోలేదన్న కారణంతో ఇరాన్‌లో ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి పెరుగు పోశాడు.

    దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    రోడ్డు పక్కనే ఉన్న ఓ షాప్‌లోకి ఇద్దరు మహిళలు రావడం ఆ వీడియోలో కనిపిస్తుంది. కొద్దిసేపటికే మరో వ్యక్తి వచ్చి వారితో వాదులాట ప్రారంభించి సెకన్లలోనే అక్కడున్న పెరుగు తీసి వారి తలపై కుమ్మరించడం ఈ వీడియోలో కనిపిస్తుంది.

    వెంటనే దుకాణదారు స్పందించి ఆ వ్యక్తిని బయటకు నెట్టేసి పంపించేస్తారు.

    ఆ ఇద్దరు మహిళలు హిజాబ్ ధరించకపోవడంతో ఆ వ్యక్తి పెరుగుతో దాడి చేసినట్లుగా చెప్తున్నారు.

    కాగా తలపై హిజాబ్ ధరించనందుకు ఆ ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు పబ్లిక్ ప్లేస్‌లో గొడవ సృష్టించినందుకు ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

    హిజాబ్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనలను తొలగించాలంటూ కొద్దినెలలుగా ఇరాన్‌లో పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.

  18. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల తాజా అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తుండండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసంఈ లింక్‌పైక్లిక్ చేయండి.