ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు తాజా వార్తలతో మళ్లీ కలుసుకుందాం.
పార్టీలో అంతర్గతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సజ్జల తెలిపారు. అన్ని ఆధారాలతో క్రమశిక్షణ సంఘం నిబంధనలు మేరకు సస్పెన్షన్ చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడిన తర్వాత అధినేత జగన్ సస్పెన్షన్ విధించాలని నిర్ణయించినట్టు సజ్జల వెల్లడించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు తాజా వార్తలతో మళ్లీ కలుసుకుందాం.

దిల్లీ యూనివర్సిటీలోని ఆర్ట్స్ ఫ్యాకల్టీ ప్రాంగణంలో నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ (ఎన్‌ఆర్‌ఈజీఏ)పై బహిరంగ చర్చ జరుగుతుండగా అందులో పాల్గొన్న విద్యార్థులు, కార్యకర్తలను దిల్లీ పోలీసులు నిర్బంధించారు.
కలెక్టివ్ అనే విద్యార్థి సంఘం ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. పని హక్కు, ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఈజీఏ గురించి చర్చను నిర్వహించారు.

ప్రఖ్యాత ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్, ఉత్తరప్రదేశ్‌లోని సంఘటిన్ కిసాన్ మజ్దూర్ సంఘఠన్‌కు చెందిన రిచా సింగ్, హరియాణాలోని జాన్ సంఘర్ష్‌కు చెందిన కామ్రేడ్ సోమ్‌నాథ్ ఈ కార్యక్రమంలో ప్రసంగించాల్సి ఉంది.
ఈ చర్చా కార్యక్రమం ప్రారంభమైన కొద్ది సేపటికే అక్కడికి వచ్చిన దిల్లీ పోలీసులు కార్యక్రమాన్ని అర్ధంతరంగా నిలిపేశారు.
నిర్వాహకులను, విద్యార్థులను, వక్తలను మారిస్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కామ్రేడ్ సోమ్‌నాథ్‌తో పాటు దిల్లీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు, ఒక విదేశీ విద్యార్థిని పోలీసులు మూడు గంటలకు పైగా నిర్బంధంలో ఉంచారు.


ఫొటో సోర్స్, ANI
రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో ఆయన ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తనుంది.
రాహుల్ గాంధీకి అత్యున్నత న్యాయస్థానం నుంచి ఉపశమనం లభించకపోతే, నెల రోజుల్లోగా ఆయన నివసిస్తోన్న దిల్లీలోని ప్రభుత్వ బంగ్లా (ఎంపీలకు కేటాయించే ఇల్లు)ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఒక అధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది.

ఫొటో సోర్స్, ANI
2004లో లోక్‌సభ ఎంపీ అయ్యాక రాహుల్ గాంధీకి న్యూదిల్లీలోని లుటియన్స్ జోన్, తుగ్లక్ లేన్‌లోని 12వ నంబర్ బంగ్లాను కేటాయించారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ ఈ బంగ్లాలోనే నివాసం ఉంటున్నారు.
శుక్రవారం లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన నోటిఫికేషన్‌లో, కేరళలోని వాయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
2019 నాటిపరువు నష్టం కేసులో సూరత్ కోర్టు గురువారం రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది.

ఫొటో సోర్స్, ANI
వార్షికాదాయం రూ. 7 లక్షల కంటే కాస్త ఎక్కువగా ఉండే వారికి ఉపశమనాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లులో చేసిన సవరణకు శుక్రవారం లోక్‌సభలో ఆమోదం లభించింది.
ఈ సవరణ తర్వాత, ఇప్పుడు సంవత్సరానికి రూ. 7 లక్షల కంటే కొంచెం ఎక్కువ సంపాదించే వారికి కూడా పన్ను మినహాయింపు దక్కుతుంది.
కొత్త పన్ను విధానంలో, ఏటా రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
అయితే, రూ. 7 లక్షలకు మించి ఆదాయం సంపాదించే వారు ఇప్పుడు మొత్తం ఆదాయంపై పన్ను చెల్లించే బదులుగా, రూ. 7 లక్షలు దాటిన తర్వాత మొత్తంపై మాత్రమే పన్ను చెల్లించాలనివార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
‘నరేంద్ర మోదీ గారూ మీ చెమ్చాలు ఒక అమరుడైన ప్రధానమంత్రి కుమారుడిని దేశద్రోహి అన్నారు. మీ ఒక ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ తండ్రి ఎవరు అని ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్ల ఆచారాలు అనుసరిస్తూ ఒక కొడుకు. తన తండ్రి చనిపోయిన తర్వాత తలపాగా ధరిస్తాడు. తన కుటుంబ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తారు. నిండు సభలో మీరు మొత్తం కుటుంబం, కశ్మీరీ పండిట్ల సమాజాన్ని అవమానిస్తూ ఆయన నెహ్రూ పేరు ఎందుకు పెట్టుకోరు అన్నారు. కానీ మీకు ఏ జడ్జీ రెండేళ్లు శిక్ష వేయలేదు. మీకు సభ నుంచి ఎవరినీ డిస్‌క్వాలిఫై చేయలేదు.రాహుల్ జీ ఒక నిజమైన దేశభక్తుడిలా అదానీ దోపిడీపై ప్రశ్నలు లేవనెత్తారు. నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీపై ప్రశ్నలు లేవనెత్తారు. మీ మిత్రుడు గౌతమ్ అదానీ దేశ పార్లమెంటు, భారత ప్రజలకంటే గొప్పవాడైపోయాడా. ఆయన దోపిడీ గురించి ప్రశ్నిస్తే, మీరెందుకు చిరాకుపడిపోయారు. మీరు మా కుటుంబాన్ని కుటుంబపాలన అంటారు. తెలుసుకోండి ఇదే కుటుంబం భారత ప్రజాస్వామ్యానికి తన రక్తంతో తడిపింది’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
‘ఎవరిని మీరు అంతం చేయాలని చూస్తున్నారో అదే కుటుంబం భారత ప్రజల గళాన్ని బలంగా చేసింది. తరతరాలుగా సత్యం కోసం పోరాడుతోంది. మా నరాల్లో ప్రవహించే రక్తానికి ఒక ప్రత్యేకత ఉంది. మీలాంటి పిరికివారు, అధికార దాహం ఉన్న నియంత ముందు ఎప్పటికీ తలవంచలేదు. ఎప్పటికీ వంచదు. మీరు ఏం చేసుకున్నా’ అని ప్రియాంక అన్నారు.

ఫొటో సోర్స్, Anumula Revanth Reddy
రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
‘దేశ ఐక్యత - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ “భారత్ జోడో యాత్ర” చేపట్టడం… అదానీ - మోదీ చీకటి స్నేహంపై నిలదీయడం. అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ కుట్రను న్యాయపోరాటం ద్వారా కాంగ్రెస్ ఛేదిస్తుంది’ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తనపై అనర్హత వేటు వేయడంపై రాహుల్ గాంధీ స్పందించారు.
‘దేశం గళం వినిపించడానికి నేను పోరాడుతున్నాను. అందుకు ఎలాంటి మూల్యం చెల్లించమన్నా చెల్లిస్తాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
కాగా శుక్రవారం ఆయనపై అనర్హత విధిస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ నోటీసులు జారీ చేశారు.
‘మోదీ ఇంటిపేరు’ను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఆయనకు దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
గురువారం ఆయనకు శిక్ష పడింది.
ఈ నేపథ్యంలో ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, facebook
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ దిక్కరించారంటూ నలుగురు ఎమ్మెల్యేలపై అధికార వైఎస్ఆర్సిపి సస్పెన్షన్ వేటు వేసింది.
నిన్న జరిగిన మండలి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధను బలపరిచారు.
దాంతో ఆమె క్రాస్ ఓటింగ్ సహాయంతో విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో టిడిపికి ఓటు వేసిన ఎమ్మెల్యేలను గుర్తించామని నిన్న ఆ పార్టీ ప్రకటించింది.
దానికి అనుగుణంగా ఈరోజు సస్పెన్షన్ విధిస్తూ వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటన చేశారు.
ఇప్పటికే వైఎస్ఆర్సిపి విధానాలను వ్యతిరేకిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అదే జిల్లాకు చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తో పాటుగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్టు మీడియాకు తెలిపారు.
పార్టీలో అంతర్గతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సజ్జల తెలిపారు. అన్ని ఆధారాలతో క్రమశిక్షణ సంఘం నిబంధనలు మేరకు సస్పెన్షన్ చేస్తున్నట్టు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులతో మాట్లాడిన తర్వాత అధినేత జగన్ సస్పెన్షన్ విధించాలని నిర్ణయించినట్టు సజ్జల వెల్లడించారు.

ఫొటో సోర్స్, facebook/Sajjala Ramakrishna Reddy
చంద్రబాబు ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్లు ఇచ్చారు: సజ్జల
ఒక్కొక్క ఎమ్మెల్యేకి పది నుంచి 15 కోట్లు చొప్పున చంద్రబాబు ఇచ్చారంటూ సజ్జల ఆరోపించారు.
కాగా వైసీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆత్మ ప్రబోధానుసారమే తాను ఓటేసినట్టు మరోసారి ఆయన స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, YSRCP
‘నేను ఓటేయడం వల్లే జయమంగళ వెంకటరమణ గెలిచారు’: మేకపాటి
తనపై వస్తున్న ఆరోపణలను ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. తాను ఓటు వేయడం వల్లే జయ మంగళం వెంకటరమణ గెలిచారంటూ ఆయన తెలిపారు. తనపై సస్పెన్షన్ హాస్యాస్పదం అంటూ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Brs PARTY
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన ఈరోజును, భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభివర్ణించారు.
‘‘రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట.
రాజ్యాంగబద్ధ సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయినపార్లమెంటును సైతం తమ హేయమైన చర్యల కోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం.
ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతోంది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు.
పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపి ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి" ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, facebook/Sravan Dasoju
రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కక్షపూరిత విధానానికి, పిరికితనానికి నిదర్శనమని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకుడు దాసోజ్ శ్రవణ్ అన్నారు.
ఎంపీగా రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించడంపై ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
‘‘ప్రతీకార చర్య, పిరికితనంతోనే రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించారు. అదానీ కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయకుండా తమకు సన్నిహితులైన పెట్టుబడిదారులను, వైట్ కాలర్ నేరస్థులను మోదీ సర్కారు ఎలాంటి జంకు లేకుండా కాపాడుతుందనేది స్పష్టంగా తెలుస్తోంది. కానీ, సిగ్గు లేకుండా ప్రతిపక్షాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోంది’’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఎంపీగా రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడం మోదీ సర్కారు ప్రతీకార వైఖరికి నిదర్శనమని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి వ్యాఖ్యానించారు.
‘‘భారత్ జోడో యాత్ర’’ వల్ల ప్రజల్లో రాహుల్‌కు ఆదరణ పెరగడాన్ని మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ నోరును నొక్కేయాలని బీజేపీ భావిస్తుందని అన్నారు. ఒకవేళ రాహుల్ గాంధీని మాట్లాడనిస్తే, అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుందని బీజేపీకి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, ANI
రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యత్వం రద్దు అయ్యాక శుక్రవారం బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదాలు కొనసాగుతున్నాయి.
రుజువులు లేకుండా ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని బీజేపీ నేత, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
‘‘నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు. 2018నాటి ఒక పరువునష్టం కేసులో ఆయన సుప్రీం కోర్టు వేదికగా క్షమాపణలు చెప్పారు. రుజువులు లేకుండా ఆరోపణలు చేయడం, ప్రజల పరువుకు భంగం కలిగించే పనులు మానుకోవాలని సుప్రీం కోర్టు ఆయనను హెచ్చరించింది.
అయినప్పటికీ, ఆయనకు అది అలవాటు అయిపోయింది. గాంధీ కుటుంబం ఏదైనా చేయగలదని, తాము దేశానికి, చట్టానికి అతీతులం అని రాహుల్ గాంధీ భావిస్తున్నారు’’ అని అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
కింగ్ చార్ల్స్ రాజు హోదాలో చేపట్టనున్న తొలి విదేశీ పర్యటన వాయిదా పడినట్లు ఎలిసీ ప్యాలస్ వెల్లడించింది.
ఆయన ఫ్రాన్స్ వెళ్లాల్సి ఉండగా అక్కడ పింఛను సంస్కరణకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండడంతో పర్యటన వాయిదా వేశారు.
రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయంపై తాము రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతామని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు.
ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని, మాట్లాడకుండా కూర్చుంటామని అనుకోవద్దని జైరాం రమేశ్ అన్నారు.ప్రధాని, అదానీ మధ్య సంబంధాల విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయకుండా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ఆయన ఆరోపించారు. ‘భారతదేశ ప్రజాస్వామ్యానికి ఓం శాంతి’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, లోక్‌సభ అభ్యర్థిత్వంపై అనర్హత వేటు పడింది.
ఎంపీగా ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ నోటీసులు జారీ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘మోదీ ఇంటిపేరు’ను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు ఆయనకు దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
గురువారం ఆయనకు శిక్ష పడింది.
ఈ నేపథ్యంలో ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేశారు.