కూలిపని చేస్తూనే, రోడ్లపై విగ్రహంలా నిలబడుతున్న పంజాబ్ యువకుడు

వీడియో క్యాప్షన్, కూలిపని చేస్తూనే, రోడ్లపై విగ్రహంలా నిలబడుతున్న పంజాబ్ యువకుడు
ప్రచురణ

కొన్నిసార్లు కూడలిలో విగ్రహంలా నిల్చోవడం, కొన్నిసార్లు కూలీగా పనిచేయడం.. ఒకే వ్యక్తి జీవితంలోని రెండు కోణాలు ఇవి.. ఈయన శ్రీ ముక్తసర్ సాహిబ్‌ జిల్లాలోని కోట్లి దియోన్ గ్రామానికి చెందిన గోవింద్ సింగ్. గోవింద్ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇలా రెండు పనులు చేస్తుంటారు. ‘‘నేనిలా గత రెండున్నరేళ్ల నుంచీ చేస్తున్నా. కొందరికి నచ్చుతుంది.. కొందరు నన్నసలు పట్టించుకోరు. ఒక ఏడాది దీపావళికి నా దగ్గర రూ. 200 మిగిలాయి. నా యజమాని నాకు పూర్తిగా చెల్లించలేదు. దీంతో నేను మా సోదరి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఆమెకు పెళ్లైంది. నేను నా కుటుంబాన్ని కూడా పోషించాలి. దాంతో ఆ రోజు నుంచే ఇలా చేయడం మొదలైంది. నేను ఆ 200 రూపాయలతో రంగులు కొన్నాను. నాకు తలపై పెట్టుకునే హ్యాట్ కూడా లేదు. నేను మా పిల్లల డ్రెస్‌ నుంచి దాన్ని తీసుకున్నా.’’ అని గోవింద్ చెప్పారు.చిన్నతనం నుంచే విగ్రహంలా నిలబడడం ఒక హాబీలా ఉండేదని గోవింద్ సింగ్ చెప్పారు. తండ్రి మంచానపడడంతో దాన్నే తన అదనపు ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. భర్త ఇలా గంటలు గంటలు ఎండలో నిలబడ్డం చూస్తుంటే బాధగా ఉంటుందని గోవింద్ భార్య చెబుతున్నారు. కానీ కుటుంబం కోసం అది తప్పలేదంటున్నారు.‘‘ప్రతి ఒక్కరికీ ఒక కల ఉంటుంది. ప్రతి ఒక్కరూ మంచి జీవితం కోరుకుంటారు. ఏదైనా సినిమాలోనో, పాటలోనో నాకు ఏదైనా పాత్ర దొరుకుతుందని అనుకుంటున్నా.’’ అని గోవింద్ అన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)