సెక్స్ సామర్థ్యం సున్తీ చేసుకుంటే పెరుగుతుందా?

ప్రచురణ

సున్తీ అనేది ఒక శస్త్రచికిత్స. దీన్ని వేల ఏళ్లుగా నిర్వహిస్తున్నారు.

ఈజిప్టులో వేల ఏళ్లకు ముందు నుంచి సున్తీ నిర్వహించేవారని చరిత్రకారులు భావిస్తున్నారు. నేటికీ చాలా ప్రాంతాల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరికి సున్తీ జరుగుతోంది.

ఈ చికిత్సలో భాగంగా పురుషాంగం ముందుండే చర్మాన్ని తొలగిస్తారు. ఎక్కువగా ముస్లింలలో పుట్టినప్పుడే సున్తీ చేస్తారు.

ఆ తర్వాతి స్థానంలో అమెరికా వాసులు ఉంటారు. ఇక్కడ జన్మించిన పురుషుల్లోనూ దాదాపు 80.5 శాతం మందికి ఈ చికిత్స నిర్వహిస్తున్నట్లు 2016నాటి డేటా చెబుతోంది. ఈ చికిత్సతో చాలా ప్రయోజనాలు ఉంటాయని ఇక్కడ దశాబ్దాల నుంచి ప్రజలు భావిస్తున్నారు.

సాధారణంగా సున్తీని బాల్యంలోనే చేస్తుంటారు. మరికొందరు మాత్రం ఆరోగ్యపరమైన కారణాలతో కాస్త పెద్దయ్యాక కూడా దీన్ని చేయించుకుంటారు.

సున్తీపై ప్రశ్నలకు సైన్స్ ఇస్తున్న నాలుగు సమాధానాలేంటో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)