You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రిషి సునక్ ఎవరు? బ్రిటన్ ప్రధాని స్థాయికి ఎలా ఎదిగారు?
బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా 42 ఏళ్ల రిషి సునక్ బాధ్యతలు చేపడతారని కన్జర్వేటివ్ పార్టీ కమిటీ ప్రకటించింది. బ్రిటన్ తొలి భారత సంతతి ప్రధానిగా, తొలి ఆసియా సంతతి ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.
రిషి సునక్ పూర్వీకులు భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. భారత మూలాలున్న ఆయన తల్లిదండ్రులు 1960లో తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకు వెళ్లారు.ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో 1980లో రిషి జన్మించారు. అక్కడే ఆయన తండ్రి వైద్యుడిగా పని చేశారు. తల్లి సొంతంగా ఫార్మసీ నడిపేవారు. వారికి కలిగిన ముగ్గురు సంతానంలో రిషి పెద్దవారు.స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత రిషి, గోల్డ్‌మన్ శాక్స్‌లో పనిచేశారు. ఆ తర్వాత 'ద చిల్డ్రన్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజ్‌మెంట్, థెలెమ్ పార్ట్‌నర్స్‌లో భాగస్వామిగా పనిచేశారు.స్థానిక కమ్యూనిటీకి తన తల్లిదండ్రులు చేసిన సేవ, సహాయం నుంచి ప్రేరణ పొందానని రిషి సునక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వారి తరహాలోనే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడం కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.2015లో జరిగిన యూకే సాధారణ ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ నుంచి రిషి సునక్ ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని థెరిసా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు.బ్రిటన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకులలో ఒకరిగా రిషి సునక్ గుర్తింపు పొందారు. బ్రిటన్‌లో అత్యంత చిన్న వయస్సుడైన చాన్స్‌లర్‌గా 2020 ఫిబ్రవరిలో నియమితులైన తర్వాత రిషి సునక్ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. రాత్రికి రాత్రే ఆయన సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆయనను ప్రజలు ముద్దుగా 'డిషీ రిషి' అని పిలుచుకునేవారు. కరోనా మహమ్మారి సమయంలో రిషి సునక్ రూపొందించిన ఆర్థిక విధానాల కారణంగా ఆయనకు మరింత ప్రజాదరణ దక్కింది.అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో రిషి పేరు కూడా వార్తల్లో నిలిచింది. ఆయనకు క్రికెట్, ఫుట్‌బాల్, ఫిట్‌నెస్, సినిమాలంటే ఇష్టమని తన వెబ్‌సైట్‌లో రాసుకొచ్చారు.ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, కర్ణాటకు చెందిన ఎన్‌ఆర్ నారాయణ, సుధా మూర్తి దంపతుల కుమార్తె అక్షతా మూర్తిని రిషి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
ఇవి కూడా చదవండి:
- Virat Kohli: ఆ షాట్ ఒక మానవుడు కొట్టి ఉంటే ఔటయ్యేవాడు.. విరాట్ కోహ్లీ బౌండరీ దాటించి, సిక్స్‌గా మలిచాడు
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)