నాసా డార్ట్ మిషన్ ప్రోబ్ గ్రహశకలాన్ని ఢీకొట్టడానికి కొన్ని క్షణాల ముందు...
ప్రచురణ
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏర్పాటు చేసిన 'డార్ట్' (డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్) స్పేస్ ప్రోబ్.. ఒక ఆస్టరాయిడ్‌ను నేరుగా ఢీకొట్టింది.
ఈ క్రమంలో ఆ స్పేస్ ప్రోబ్ ధ్వంసమైంది.
భూగ్రహానికి ముప్పు కలిగించగల గ్రహశకలాలలను క్షేమంగా దారితప్పించవచ్చా అనేదానిని పరీక్షించటం కోసం నాసా ఉద్దేశపూర్వకంగానే ఈ స్పేస్ ప్రోబ్‌తో ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టించింది.
డిమార్ఫోస్ అని పిలుస్తున్న ఈ ఆస్టరాయిడ్ 160 మీటర్ల నిడివి ఉంది. డార్ట్ స్పేస్ ప్రోబ్ దీనిని ఢీకొట్టే క్షణం వరకూ తన దగ్గరున్న కెమెరాతో సెకనుకు ఒక ఫొటో చొప్పున పంపించింది.
ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టి డార్ట్ ధ్వంసం కావటంతో ఫొటోల ప్రవాహం ఆగిపోయింది.
ఇవి కూడా చదవండి:
- లెస్టర్‌లో హిందూ, ముస్లింల మధ్య హింసకు ‘భారత్ కనెక్షన్’ ఏంటి?
- మెక్సికో: 8 ఏళ్లుగా 43 మంది విద్యార్థులు మిస్సింగ్.. ఏమి జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు
- మ్యాక్స్‌వెల్ రన్ అవుట్: స్టంప్స్ మీద ఒక బెయిల్ ఉన్నా ఔటేనా? ఐసీసీ క్రికెట్ నిబంధన ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: పొలంలో దిగి, వరి నాట్లు వేసిన కలెక్టర్లు... గట్టు మీదే భోజనాలు
- సీఐఏ సీక్రెట్ మ్యూజియం: సద్దాం హుస్సేన్ లెదర్ జాకెట్, ఒసామా బిన్ లాడెన్ ఇల్లూ ఇక్కడ ఉంటాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)