You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్ యుద్ధం ఆపాలని కోరుతున్న ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు
ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు, అనేక మంది నాయకులు రాణి ఎలిజబత్ అంత్యక్రియల సందర్భంగా ఒకచోట కనిపించారు. వారిలో చాలా మంది ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు న్యూయార్క్ చేరుకున్నారు. ఈసారి సమావేశాల్లో యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం ప్రధానంగా చర్చకు రానుంది. న్యూయార్క్ నుంచి బీబీసీ ప్రతినిధి నదా తాఫిక్ అందిస్తున్న కథనం.
మన్‌హట్టన్ తూర్పున రోడ్లపైన తప్పించుకోలేనంత ప్రతిష్టంభన, కట్టుదిట్టమైన భద్రత కనిపిస్తున్నాయి. కఠినమైన అంశాలకు పరిష్కారాలను కనుక్కునేందుకు ఏటా మాదిరిగానే దేశాధినేతలు పొడవాటి వాహన శ్రేణితో సమావేశాలకు వస్తున్నారు. ఏమైనప్పటికీ ఈ ఏడాది ఒక అవిచ్చిన్నమైన భేదబావం కనిపిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధపు భస్మంలో నుంచి పుట్టిన ఐక్యరాజ్యసమితికి యుక్రెయిన్ యుద్ధం సవాలుగా మారింది.
ఇది తీవ్ర అపాయం పొంచి ఉన్న కాలమన్నారు ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి. ఆధిపత్యం కోసం పశ్చిమ దేశాలు ఒక వైపు - రష్యా, చైనా మరోవైపు చేరి యుద్దం చేస్తున్నాయన్నారు.
''ప్రచ్చన్న యుద్ధ కాలం నుంచి వ్యూహాత్మక భౌగోళిక విభజనలు మన మధ్య చీలికలు తెచ్చాయి. అవి మనం ఎదుర్కొంటున్న సవాళ్ల పట్ల ప్రపంచం స్పందించడాన్ని స్థంభింపజేస్తున్నాయి. మన ప్రపంచం యుద్ధాలతో మొద్దుబారిపోయింది. వాతావరణ సమస్యలు గందరగోళం సృష్టిస్తున్నాయి. భయపెడుతోన్న ద్వేషభావంతోపాటు, పేదరికం, ఆకలి, అసమానతలు సిగ్గుపడేలా చేస్తున్నాయి'' అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరిస్ అన్నారు.
గతేడాది యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియన్‌స్కీ - అంతర్జాతీయ వేదికపైకి దూసుకొస్తున్న కొత్త వ్యక్తిగా నిలిచారు.
ఐక్యరాజ్య సమితి ఓటింగ్ తర్వాత, ఆయన అంతకు ముందే రికార్డు చేసిన ప్రసంగాన్ని సమితి సభ్య దేశాల ప్రతినిధుల ఎదుట ప్రదర్శించనున్నారు. నేతలు నేరుగానే మాట్లాడాలనే నిబంధనకు ఇది మినహాయింపు. పశ్చిమ దేశాల అధికారులు - యుక్రెయిన్ విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే న్యూయార్క్‌లో రష్యన్లతో ఎలాంటి దౌత్య చర్చలకు అవకాశం లేదంటున్నారు.
ఇక్కడ అనేక దేశాలు, ముఖ్యంగా దక్షిణాది దేశాలు - యుక్రెయిన్ యుద్ధం ఆగాలని కోరుకుంటున్నారు. యుద్ధం కారణంగా తమ దేశాల్లో ఇతర కీలక సమస్యలను ప్రస్తావించలేని పరిస్థితి వారిది. పర్యావరణ మార్పులపై చర్యలు స్తంభించాయి. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార సమస్య తీవ్రమైంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్, మంకీపాక్స్ లాంటివాటిపైనా అత్యున్నత స్థాయిలో చర్చించనున్నారు.
మరోవైపు చైనా, రష్యా అధ్యక్షులు ఈ సమావేశాల్లో పాల్గొనట్లేదు. భౌగోళిక విభజనల నడుమ పరివర్తనా పరిష్కారాలకూ, ప్రతిష్టాత్మక లక్ష్యాలపైనా చర్చించేందుకు ఈ వారం రోజులు మంచి అవకాశమని యుఎన్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- OSCAR: అమెరికన్ సినిమాల అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?
- రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి, మైదానంలో ప్రవర్తన గురించి చర్చ ఎందుకు?
- వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదు - ఎన్నికల సంఘం
- కాకినాడ: ‘గర్బిణి అని నమ్మించారు, తొమ్మిది నెలల తర్వాత డెలివరీకి వెళితే గర్భంలో శిశువు లేదన్నారు’.. ప్రైవేటు ఆసుపత్రిపై పోలీసులకు ఫిర్యాదు
- ‘సిజేరియన్ చేయాలంటే హరీశ్ రావు నుంచి లెటర్ తెమ్మన్నారు, నార్మల్ డెలివరీ సమయంలో నా భార్య చనిపోయింది’
- ఏడాదికి 12 వేల కోట్ల వ్యాపారం చేసే కంపెనీని విరాళంగా ఇచ్చేసిన ‘శ్రీమంతుడు’
- సౌత్ ఇండియాతో నార్త్ ఇండియా అభివృద్ధిలో పోటీ పడలేకపోతుందా
- ఇరాన్ నిరసనలు: హిజాబ్‌లను తగులబెడుతున్న మహిళలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)