You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యుక్రెయిన్‌లో ఎదురుదెబ్బలు తగులుతున్నా పుతిన్ ధైర్యంగానే కనిపిస్తున్నారు. కారణం ఏంటి?
రష్యన్లను కీయెవ్ శివార్లలో అడ్డుకున్న తర్వాత యుక్రేనియన్లు ఇప్పుడు అతి పెద్ద విజయాన్ని సాధించారు. కానీ యుక్రెయిన్‌లో ఇప్పటికీ 20 శాతం భూభాగం రష్యా ఆక్రమణలోనే ఉంది. అయితే, యుక్రెయిన్ తాజా విజయాలపైన రష్యా ఎలా స్పందిస్తున్నదే అసలు ప్రశ్న. మాస్కో నుంచి బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోజెన్‌బర్గ్ అందిస్తున్న కథనం.
గురువారం క్రెమ్లిన్‌లో అధ్యక్షుడు పుతిన్ వేడుక చేసుకున్నారు.
ఈ వేడుక సైనిక విజయానికి సంబందించింది కాదు. రష్యన్ శానిటరీ సర్వీస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కరోనా సమయంలో పోరాడిన వైద్యులకు, శాస్త్రవేత్తలకు ఆయన అవార్డులు అందించారు.
అంటు వ్యాధులు, బ్యాక్టీరియా మనకు కనిపించని శత్రువులని అన్నారాయన.
అలా యుద్ధ పరిభాషకు చాలా దగ్గరగా వచ్చారు పుతిన్.
ఈశాన్య యుక్రెయిన్‌లో రష్యా సేనల వెనుకంజ తర్వాత ప్రభుత్వ టీవీల స్వరం మారింది.
యక్రెయిన్ బలగాలు ఆధిక్యం సాధించాయని ఈ రష్యా అనుకూల తిరుగుబాటు నాయకుడు అంటున్నారు. అంతే కాదు, అక్కడేం జరుగుతుందన్న విషయంలో రష్యాలో మాట్లాడగూడని మాట కూడా ఆయన మాట్లాడారు.
ఇది యుద్ధం అన్నారాయన.
ఇప్పుడు ప్రజలు పుతిన్‌పై నేరుగా విమర్శలు సంధిస్తున్నారు.
సెయింట్ పీటర్స్ బర్గ్, మాస్కో నగర కౌన్సిలర్లు విడుదల చేసిన ప్రకటనల్లో.. వ్లాదిమిర్ పుతిన్ గద్దె దిగాలన్నారు.
దేశాధ్యక్షుడికి.. కౌన్సిలర్ టిమోఫి నికోలయేవ్ ఈ సందేశం ఇచ్చారు..
''మీరు చరిత్రలో నిలిచిపోవాలనుకుంటే ఇప్పటికిప్పుడే మీరు రాజీనామా చేయడం ఉత్తమం. అప్పుడే చరిత్రలో నిలబడతారు.''
కానీ రష్యాలో.. కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే కౌన్సిలర్లకుండే అధికారాలు చాలా తక్కువ.
యుక్రెయిన్‌లో ఎదురుదెబ్బలు తగులుతున్నా.. పుతిన్ ధైర్యంగానే కనిపిస్తున్నారు.
విదేశీ పర్యటనకు బయల్దేరడం ఆయన ధైర్యంగానే ఉన్నారనేదానికి ఒక ఉదాహరణ. పుతిన్ ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. ప్రాంతీయ సదస్సులో భాగంగా చైనా, భారత్, పాకిస్తాన్, ఇరాన్, టర్కీ దేశాల నేతలను ఆయన కలవనున్నారు. రష్యాను ఏకాకి చేసే పశ్చిమ దేశాల ఆంక్షలు విఫలమయ్యాయని ప్రపంచ వేదికపై చూపించేందుకు పుతిన్ ఆసక్తిగా ఉన్నారు.
యుక్రెయిన్‌కు తమ దేశ రహస్యాలను చేరవేస్తున్న గూఢచారుల కోసం రష్యన్ సీక్రెట్ సర్వీస్ వేటాడుతోంది. గూఢచారులనే నెపంతో సామాన్యులను కూడా అదుపులోకి తీసుకుంటోంది.
రష్యన్ కులీన వర్గం ఇప్పుడేం చేస్తుందన్నదే అసలు ప్రశ్న. వారు ఇప్పటికీ పుతిన్ పట్ల విధేయంగానే ఉంటారా?
''కులీనవర్గంలో కూడా పుతిన్‌ను వ్యతిరేకించే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ వ్యవస్థలో బతకాలంటే వాళ్లు విధేయతను ప్రదర్శించాల్సిందే. కానీ భవిష్యత్తులో, బహుశా వారు ధిక్కారాన్ని ప్రదర్శిస్తారని నేను భావిస్తున్నాను'' అని రాజకీయ విశ్లేషకులు ఆండ్రీ కొలెస్నికోవ్ అన్నారు.
యుక్రెయిన్‌లో యుద్ధాన్ని తక్కువ అంచనా వేశారని, అధ్యక్షుడి స్థానం బలహీనపడిందనే వాదనను క్రెమ్లిన్ తిప్పికొడుతోంది.
వ్లాదిమిర్ పుతిన్ తన దిశను మార్చుకుంటారనే సంకేతాలు ఏ మాత్రం లేవు.
ఇవి కూడా చదవండి:
- విజయవాడ: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని కాలితో తన్నుతూ దాడి చేసిన లెక్చరర్.. ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగింది?
- హిజాబ్ ధరించనందుకు అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రాణాలు కోల్పోయిన యువతి
- ట్విటర్ తమ పట్టణంపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ కేసు వేసిన ప్రజలు
- నేలకొండపల్లి: ఎస్సై స్రవంతి రెడ్డి కులం పేరుతో బహిరంగంగా దళితులను దూషించారా? లేదా? ఎస్సీ కాలనీ వాసులు ఏమంటున్నారు, పోలీసుల వాదనేంటి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- క్వీన్ ఎలిజబెత్ 2: కోహినూర్ వజ్రం, హంసలు, డాల్ఫిన్స్, ఖరీదైన కార్లు, భూములు, బంగళాలు.. కింగ్ చార్లెస్‌కు తల్లి నుంచి వారసత్వంగా ఏం వస్తున్నాయి?
- మూన్‌లైటింగ్ అంటే ఏమిటి? ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి?
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంపై బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధానికి కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)