మ్యూనిక్ ఒలింపిక్స్ నరమేధానికి 50 ఏళ్ళు... చనిపోయిన ఆటగాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడేమంటున్నారు?

వీడియో క్యాప్షన్, మ్యూనిక్ ఒలింపిక్స్‌ నరమేధంలో మృతులైన ఇజ్రాయెల్ ఆటగాళ్ల కుటుంబాలు ఇప్పుడేమంటున్నాయి?
ప్రచురణ

1972లో మ్యూనిక్‌ ఒలింపిక్స్‌లో జరిగిన దాడిలో మరణించిన ఇజ్రాయెలీ ఆటగాళ్ల కుటుంబాలకు పరిహారం అందించడంలో తమ దేశం చేస్తున్న జాప్యం సిగ్గుచేటుగా ఉందని అంగీకరించారు జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మైర్.

50 ఏళ్ల క్రితం ఇదే రోజున పాలస్తీనా సాయుధులు ఇద్దరు ఇజ్రాయెలీ ఆటగాళ్లను కాల్చి చంపి, 9 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. వారిని కాపాడే విఫల ప్రయత్నంలో 9 మంది బందీలతో పాటు ఓ అధికారి కూడా మరణించారు.

మ్యూనిక్‌లోని ఒలింపిక్ గ్రామంలో పాలస్తీనా గన్‌మెన్లు సెక్యూరిటీ పోస్ట్‌ను దాటుకుని ఇజ్రాయెల్ టీమ్‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని అందరూ గుర్తు చేసుకంటున్నారు. నాటి ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది.

అర్ధరాత్రి పూట... ముసుగులు వేసుకున్న అరబ్బులు, ఇజ్రాయెల్ ఆటగాళ్లున్న డార్మిటరీపై దాడి చేశారు. సాయుధులు బ్లాక్ సెప్టెంబర్ అనే టెర్రరిస్టు గ్రూపుకు చెందినవారు.

బ్లాక్ సెప్టెంబర్ గ్రూప్ ఇజ్రాయెల్ ఆటగాళ్లున్న అపార్ట్‌మెంట్‌ను కనుక్కుని ఇద్దర్ని అక్కడే చంపేసి, తొమ్మిది మందిని బందీలుగా పట్టుకెళ్లింది. ఆ సంఘటన తర్వాత 24 గంటల పాటు టీవీల్లో ఇదే వార్త ప్రసారం అయింది. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనీయుల్ని వదిలేయాలని పాలస్తీనా బృందం డిమాండ్ చేసింది.

ఈ దాడి ముగిసిన తర్వాత ఒలింపిక్స్ కొనసాగాయి. ఇది ఇజ్రాయెల్-జర్మనీ సంబంధాల్లో ఓ అడ్డంకిగా నిలిచింది. ఆ దాడిలో చనిపోయిన ఆటగాళ్ల కుటుంబీకులు... పరిహారం విషయంలో ఒప్పందం జరక్కముందే మ్యూనిక్‌లో జరుగుతున్న సంస్మరణ కార్యక్రమాన్ని బహిష్కరించాలని మొదట భావించారు. కానీ ఆ తర్వాత జర్మనీ నేతలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు నిర్ణయించుకున్నారు.

స్టెఫనీ ప్రెంటైస్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)