వీర్యం, అండం లేకుండా సృష్టించిన ఈ పిండం గుండె కొట్టుకుంటోంది

వీడియో క్యాప్షన్, వీర్యం, అండం లేకుండా సృష్టించిన ఈ పిండం గుండె కొట్టుకుంటోంది
ప్రచురణ

ఎలాంటి అండాలు లేదా వీర్య కణాలు లేకుండా ఎలుక పిండాలను కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిలో మెదడుతోపాటు కొట్టుకుంటున్న గుండె కూడా కనిపిస్తోంది.

మూలకణాలతో (స్టెమ్ సెల్స్‌తో) అభివృద్ధి చేసిన ఈ ఎలుక పిండాలు ఎనిమిది రోజులపాటు సజీవంగానే ఉన్నాయి.

అవయవాల అభివృద్ధి ఎలా జరుగుతుందో తెలుసుకోవడంతోపాటు.. కొంతమంది గర్భిణులకు మొదట్లోనే ఎందుకు గర్భస్రావం అవుతుందో తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి.

ఈ అధ్యయన ఫలితాలు కొత్త ఆశలు చిగురింప చేస్తున్నప్పటికీ, దీనిలో దాటాల్సిన అవరోధాలు చాలా ఉన్నాయని మరికొందరు పరిశోధకులు అంటున్నారు.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్‌టెక్) నిపుణులు సంయుక్తంగా చేపట్టిన ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ నేచర్‌లో ప్రచురితమయ్యాయి.

ఇలాంటి పరిశోధననే ఇటీవల ఇజ్రాయెల్‌లోనూనిర్వహించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)