భార్య కోరినట్లు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించిన భర్త
ప్రచురణ
గుజరాత్‌లో జునాగఢ్‌కు చెందిన 30ఏళ్ల శ్రీనాథ్ సోలంకి.. తన భార్య అంతిమయాత్రను ఘనంగా నిర్వహించారు.
శ్రీనాథ్, మోనిక 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐదేళ్ల తర్వాత మోనిక గర్భం దాల్చారు.
శ్రీమంతం తర్వాత మోనిక వెరావల్‌లోని తన పుట్టింటికి వెళ్లారు.
అయితే, తొమ్మిదో నెలలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రసవ సమయంలో మోనిక ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఆమె బిడ్డను కూడా వైద్యులు కాపాడలేకపోయారు.
మోనిక, ఆమె కడుపులో బిడ్డ చనిపోవడంతో శ్రీనాథ్ కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది.
అయితే, తన అంతిమయాత్రను ఘనంగా నిర్వహించాలని అంతకు ముందే భర్తను కోరారు.
ఇవి కూడా చదవండి:
- చీతా: ఇండియాలో 50 ఏళ్ల కిందట అంతరించిపోయిన మృగం మళ్లీ వస్తోంది
- పాము, కప్ప: ప్రపంచానికి 1,39,087 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని కలిగించిన రెండు జీవులు..
- క్యాసినో అంటే ఏంటి, అందులో ఏం చేస్తారు... చట్టాలు ఏం చెబుతున్నాయి?
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఆహారం: నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా... ఈ ప్రచారంలో నిజమెంత?
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)