You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫిన్లాండ్‌లో ఇసుక బ్యాటరీ ఆవిష్కరణ.. చలికాలంలో ఇంటిని వేడిగా ఉంచేందుకు కొత్త ప్రయోగం
ప్రపంచంలో మొట్టమొదటి శాండ్ బ్యాటరీని ఫిన్లాండ్‌లో అమర్చారు.
ఇది నెల రోజుల పాటు ఉత్పత్తి చేసిన ఉష్ణాన్ని నిల్వ చేసి శీతాకాలంలో ఇంటిని వేడిగా మార్చడానికి ఉపయోగపడుతుంది.
పవన, సౌర విద్యుత్ శక్తి ద్వారా వంద టన్నుల ఇసుకను వేడి చెయ్యడం ద్వారా దాన్ని చార్జ్ చెయ్యవచ్చు.
500 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఈ ఇసుక ఉష్ణాన్ని నిల్వ చేస్తుంది. శీతకాలంలో విద్యుత్ ఖరీదైనప్పుడు దీని సాయంతో ఇంటిలో ఉష్ణోగ్రతలు పెంచుకోవచ్చు.
గ్యాస్ విషయంలో రష్యాపైనే ఫిన్లాండ్ ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే, యుక్రెయిన్‌లో యుద్ధం వల్ల హరిత విద్యుత్‌పై ఫిన్లాండ్ దృష్టి పెట్టింది.
యూరప్‌లో రష్యాతో అత్యంత పొడవైన సరిహద్దులు గల దేశం ఫిన్లాండే. అయితే, నాటోలో చేరాలని ఫిన్లాండ్ నిర్ణయించుకోవడంతో గ్యాస్, విద్యుత్ సరఫరాలను రష్యా నిలిపివేసింది.
ఇప్పుడు సుదీర్ఘ శీతాకాలం ఇక్కడ ఎలా గడుస్తుందోనని సామాన్యులతోపాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చలు నడుస్తున్నాయి.
అయితే, పశ్చిమ ఫిన్లాండ్‌లోని ఒక చిన్న విద్యుత్ కర్మాగారంలో పనిచేస్తున్న ఈ కొత్త బ్యాటరీ ఫిన్లాండ్ వాసుల్లో కొత్త ఆశలు చిగురింపచేస్తోంది.
బీబీసీ ప్రతినిధి మట్ మెక్ గ్రాత్ అందిస్తున్న కథనం
ఇవి కూడా చదవండి:
- అలర్జీ అంటే ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
- వైసీపీ ప్లీనరి: 11 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో 5 కీలక దశలు
- రాణి రుద్రమ దేవి వారసుడు ఈయనేనా, ఇన్నాళ్లూ ఎక్కడున్నారు
- ఓలా, ఉబర్ పీక్ చార్జీల పేరుతో బాదేస్తున్నాయా... ఇదిగో పరిష్కారం
- కాళీమాతను మాంసాహారం, మద్యం తీసుకునే దేవతగా ఊహించుకునే హక్కు నాకుంది - తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)