You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Australia Floods: సిడ్నీని ముంచెత్తిన భారీ వరదలు.. ఏడాదిన్నరలో మూడోసారి ముంపులో నగరవాసులు
ఆస్ట్రేలియాలోని అతి పెద్ద నగరమైన సిడ్నీ.. పీకల్లోతు నీటిలో మునిగింది. వరదల్లో ఒక వ్యక్తి చనిపోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు.
నగరంలో ఇంకా అనేక మంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని ప్రభుత్వం ప్రకటించింది. రహదారి మార్గాలన్నీ నీటిలోనే మునిగి ఉన్నాయి.
వరదల ప్రమాదం తొలగిపోలేదని.. ఇంకా వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
బీబీసీ ఆస్ట్రేలియా ప్రతినిధి షాయిమా ఖలీల్ అందిస్తున్న కథనం.
వర్షాలు ప్రారంభమై మూడు రోజులు గడిచాయి.
వర్షం నిరంతరాయంగా కురుస్తోంది. పశ్చిమ సిడ్నీలో అంతా అల్లకల్లోలంగా మారింది.
ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
వరదల ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఇంకా వేల మంది ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కొన్ని రహదారులు నీట మునగడంతో వరద ప్రభావిత ప్రజలంతా వేరే మార్గాల ద్వారా సహాయ కేంద్రాలకు చేరుకోవాలని అత్యవసర సేవల బృందాలు కోరాయి.
ప్రస్తుతం వరదల్లో నీట మునిగిన ప్రాంతాలు కొన్ని నెలల క్రితం కూడా వర్షాల వల్ల తీవ్రంగా దెబ్బ తిన్నాయి.
సిడ్నీని ఇలా వరదలు ముంచడం 18 నెలల్లో ఇది మూడోసారి. వాయువ్య ప్రాంతంలోని విండ్సర్ పట్టణ ప్రజలు ఇంతకుముందు కూడా ఇలాంటి అసాధారణ వాతారవణ పరిస్థితులతో ఇబ్బంది పడ్డారు. కొత్తగా నిర్మించిన 12 మీటర్లున్న విండ్సర్ వంతెన నీటిలో మునిగి కొంచెమే కనిపిస్తోంది.
ఆస్ట్రేలియన్లు మరోసారి విపరీతమైన వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పుపై చర్యలు చేపట్టే అంశం ఇంకా రాజకీయ గొడవల్లో చిక్కుబడివున్న ఈ దేశం.. భూతాపం దుష్పరిణామాలను ప్రత్యక్షంగా ఎదుర్కొంటోంది.
ఇవి కూడా చదవండి:
- జమ్మూకశ్మీర్లో జీ-20 సదస్సు నిర్వహించడంపై వివాదం దేనికి... పాకిస్తాన్ ఎందుకు వద్దంటోంది?
- కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి మార్గదర్శి ఈ లాయర్
- పుష్ప గ్యాంగ్: సరికొత్తగా చందనం స్మగ్లింగ్... పగలంతా రెక్కీ, రాత్రిపూట పక్కాగా చోరీ
- డార్క్ మ్యాటర్ అంటే ఏంటి... ఈ రహస్యాన్ని సైంటిస్టులు త్వరలో ఛేదించబోతున్నారా?
- జమ్మూకశ్మీర్: అరెస్టయిన అనుమానిత లష్కరే తోయిబా మిలిటెంట్తో బీజేపీకి సంబంధం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)