అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం - 1,000మందికి పైగా మృతి

ప్రచురణ

అఫ్గానిస్తాన్‌లో భారీ భూకంపం వచ్చింది. కనీసం 1,000 మంది మరణించినట్లు పక్తికా ప్రావిన్స్‌ సమాచార శాఖ అధికారి మొహమ్మద్ అమీన్ హజీఫీ వెల్లడించారు. సుమారు 1500మంది గాయపడినట్లు ఆయన చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

మారుమూల ప్రాంతాలలోకి హెలీకాప్టర్లు వెళ్లి బాధితులను ఆసుపత్రులకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నాయి.

మరణాల సంఖ్య పెరగొచ్చని అంతకు ముందే స్థానిక అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు. వందల ఇళ్లు కూలిపోయాయని, మృతుల సంఖ్య పెరగొచ్చని తాలిబన్ నేత హిబతుల్లా అఖుండ్‌జాదా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)