పాములను పడుతున్న కాలేజీ అమ్మాయిలు

వీడియో క్యాప్షన్, పాములను పడుతున్న కాలేజీ అమ్మాయిలు
ప్రచురణ

బంగ్లాదేశ్‌లోని జహంగీర్‌నగర్ యూనివర్సిటీకి చెందిన యువతీయువకులు గాయపడిన, అనారోగ్యంతో ఉన్న పాములను రక్షించేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేశారు.

'మీరు పాములు పట్టే వాళ్ళా లేక డిజిటల్‌గా షో చేస్తుంటారా... అని చాలా మంది అడుగుతుంటారు. నిజానికి, మేం పాములను పట్టేవాళ్ళం కాదు. పాములను కాపాడేవాళ్ళం' అని చెప్తున్నారు పాముల సంరక్షకురాలు సయేదా అనన్య ఫరియా.

''మేము పాములను కాపాడి వాటి ఆవాసాలకు చేరుస్తాం'' అని ఆమె తెలిపారు.

బంగ్లాదేశ్‌లోని జహంగీర్ నగర్ యూనివర్సిటీ విద్యార్థులు గత నాలుగేళ్లలో 1,500కు పైగా పాములను కాపాడారు. అందులో చాలా వరకు గాయపడి లేదా ఇళ్లల్లో, భవనాల్లో చిక్కుకున్నవి ఉన్నాయి.

ప్రజల్లో పాముల గురించి అవగాహన పెంచాలన్నది కూడా వారి లక్ష్యం. అపోహలను తొలగించడం కూడా వారి పనిలో భాగమే.

బంగ్లాదేశ్‌లో డీప్ ఎకాలజీ అండ్ స్నేక్ రెస్క్యూ ఫౌండేషన్‌లో ప్రస్తుతం 500 మంది సభ్యులున్నారు. అందులో 50 మంది పాములను కాపాడి, విడుదల చేసే పని చేస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)