You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మీరు ఎన్నిరోజులకు ఒకసారి బెడ్‌షీట్లు, దుప్పట్లు మారుస్తారు/ఉతుకుతారు?
ఈ విషయాన్ని బహిరంగంగా చర్చించేందుకు చాలామంది ఇష్టపడరు. కానీ, ఇది మనందరిపైనా ప్రభావం చూపుతోంది. మీరు ఎన్నిరోజులకు ఒకసారి బెడ్‌షీట్లను మారుస్తుంటారు? లేదా ఉతుకుతుంటారు?
ఈ ప్రశ్నకు ప్రజల నుంచి భిన్నరకాల స్పందనలు వస్తున్నట్లు బ్రిటన్‌లో 2,250 మందిపై చేపట్టిన తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది.
ఒంటరి పురుషుల్లో సగం మంది, నాలుగు నెలల వరకు తమ బెడ్‌షీట్లను మార్చుకోమని ఈ అధ్యయనంలో వెల్లడించారు. మరో 12 శాతం తమకు గుర్తుకు వచ్చినప్పుడు ఉతకడానికి ఇస్తామని చెప్పారు. అంటే ఒక్కోసారి నాలుగు నెలల కంటే ఎక్కువ సమయమే పట్టొచ్చని వెల్లడించారు.
‘‘అది అసలు మంచిది కాదు’’అని సైకాలజిస్ట్, న్యూరోసైంటిస్ట్, స్లీప్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ లిండ్సీ బ్రౌనింగ్.. బీబీసీ రేడియో-1 న్యూస్‌బీట్‌తో చెప్పారు.
ఒంటరి మహిళలు కాస్త తరచుగా బెడ్‌షీట్లను మారుస్తుంటారు. వారిలో 62 శాతం మంది రెండు వారాలకు ఒకసారి బెడ్‌షీట్లను మారుస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు జంటలు అయితే, మూడు వారాలకు ఒకసారి బెడ్‌షీట్లు మారుస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- మన పాలపుంతలో మహా కాల బిలం ఫొటోకు చిక్కింది...
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
- తాజ్ మహల్: ‘మూసి ఉన్న గదుల్లో దాగిఉన్న ఆ రహస్యాలు ఏంటంటే..’
- రాజపక్స సోదరులు: జనం దృష్టిలో యుద్ధ వీరులు అకస్మాత్తుగా విలన్లు ఎలా అయ్యారు?
- కురుక్షేత్ర: శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ప్రదేశంలో ముస్లింలు సమాధి నిర్మించారా? బీబీసీ పరిశోధనలో ఏం తెలిసిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)