You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శ్రీలంక దక్షిణ ప్రాంతంలోనే ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి
శ్రీలంకలోని దక్షిణాది ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. అయితే అటు ఉత్తరాది ప్రాంతాలు కూడా అదే స్థాయిలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అయినప్పటికీ జనం రోడ్డెక్కడం లేదు, ఆందోళనలు చెయ్యడం లేదు. ఈ పరిస్థితికి కారణమేంటి?
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఉత్తరాన ఉన్న జాఫ్నా నగరం సహా అనేక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.మిగిలిన ప్రాంతాలతో పోల్చితే, జాఫ్నా ప్రశాంతంగానే కనిపిస్తున్నప్పటికీ, దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి ఈ నగరాన్ని కూడా వణికిస్తోంది. ఇక్కడ జనం కూడా కనీస అవసరాలైన కిరోసిన్, వంట గ్యాస్ కోసం పొడవైన క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తోంది.కేవలం జాఫ్నాలోనే కాదు మిగిలిన ఉత్తరాది ప్రాంతాలైన ముళ్లై తీవు, కిలినోచీ ప్రాంతాలు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.అయితే దక్షిణాది నగరమైన కాండీలో జరుగుతున్నట్టు ఇక్కడ ఎలాంటి ఆందోళనలు జరగడం లేదు. కొన్ని పార్టీలు, ఇతర సంస్థలు చేస్తున్న చిన్న చిన్నఆందోళనలు తప్ప మిగిలిన ఉత్తరాది ప్రాంతమంతా ప్రశాంతంగానే ఉంది. అయితే ఇందుకు మరో కారణం కూడా ఉంది.
దీనిపై పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి:
- 'ఈ మనిషితో నేను ఎందుకు ఉండలేకపోయానంటే...' - ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఆసిఫ్ అలీ జర్దారీ ఫార్ములా కాపాడగలదా?
- డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకు వాటి కోసం కొందరు పిచ్చెక్కిపోతారు?
- యుక్రెయిన్ యుద్ధం: ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయలుదేరారు... దారిలోనే రష్యా సైనికుల కాల్పుల్లో చనిపోయారు
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఆసిఫ్ అలీ జర్దారీ ఫార్ములా కాపాడగలదా?
- ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 4 నుంచి 26 జిల్లాలు... పునర్విభజనలో 5 ఆసక్తికర అంశాలు
- సూర్య కాశీభట్ల: నిజజీవితంలోనూ సెరెబ్రల్ పాల్సీ ఉన్న ఈ మహేశ్‌బాబు ఫ్యాన్‌కు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)