పాకిస్తాన్‌లో హిందూ యువతి హత్య: ‘ప్రతిఘటించడంతో కాల్చి చంపారు’

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో హిందూ యువతి హత్య: ‘ప్రతిఘటించడంతో కాల్చి చంపారు’
ప్రచురణ

పాకిస్తాన్‌లోని సింధ్‌ రాష్ట్రంలోని సక్కర్‌ జిల్లాలో పూజ కుమారి అనే 18 ఏళ్ల హిందూ యువతి హత్యకు గురైంది.

కిడ్నాప్‌కి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటించడంతో ఆమెను తుపాకీతో కాల్చి చంపారని ఆమె బంధువులు చెబుతున్నారు.

తన కూతురును కిడ్నాప్ చేసేందుకు ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారని, ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమెను హత్య చేశారని పూజ తండ్రి ఆది పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ అంశంపై పోలీసులు ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తున్నారని, సంఘటనను అన్ని కోణాల్లో విచారిస్తున్నారని, మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తారని అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)