యుక్రెయిన్ తన గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని ఎందుకు కోరుతోంది?
యుక్రెయిన్ గగనతలాన్ని 'నో ఫ్లై జోన్'గా ప్రకటించాలని గత కొన్ని రోజులుగా నాటోను, పశ్చిమ దేశాలను కోరుతున్నారు ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ.
తాజాగా మరోసారి ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. యుక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
యుక్రెయిన్‌కు చెందిన ఒక మహిళ కూడా ఇటీవల ఇదే విషయంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను ప్రశ్నించారు.
'ఆకాశం నుంచి బాంబులు, క్షిపణులు దూసుకొస్తుంటే యుక్రెయిన్ మహిళలు, పిల్లలు చాలా భయపడుతున్నారు. యుక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించండి' అని దారియా అనే మహిళ బ్రిటన్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
యుక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్నప్పటికీ, పౌరుల ప్రాణాలు పోతున్నప్పటికీ, యుక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించే సంకేతాలు మాత్రం పశ్చిమ దేశాల నుంచి రావడం లేదు. దీనికి కారణం ఏమిటి?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
