గూడ్స్ రైళ్లను లూటీ చేసి, ఖాళీ అమెజాన్, ఫెడెక్స్ బాక్స్‌లను రైల్వే ట్రాక్‌లపై వదిలేశారు

వీడియో క్యాప్షన్, అమెరికాలో గూడ్స్ రైళ్ల లూటీ
ప్రచురణ

అమెరికాలో కార్గో రైళ్లలో దొంగతనాలు ఇటీవల పెరిగిపోయాయి. లాస్ ఏంజెలిస్‌ నగరంలో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.

రోజూ పదుల సంఖ్యలో కార్గో రైళ్లు దోపిడీకి గురవుతున్నాయి. గూడ్స్ రైళ్లలోని సరకులను దొంగిలించిన తర్వాత వాటి ఖాళీ అట్టపెట్టెలను పడేస్తున్నారు.

దీంతో చాలా మందికి తాము ఆర్డర్ చేసిన సరకులు అందడం లేదు. ఈ అట్టపెట్టెలకు ఉన్న ట్యాగ్స్‌పై అమెజాన్, టార్గెట్, యూపీఎస్, ఫెడెక్స్ లాంటి ప్రముఖ కంపెనీల పేర్లు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)