కజకిస్తాన్: నిరసనకారులపై పేలిన తుపాకులు

ప్రచురణ

కజాకిస్తాన్‌ ఘర్షణల్లో తుపాకులు పేలుతున్నాయి.

నిరసనకారులతో కఠినంగా వ్యవహరించాలని దేశ అధ్యక్షుడు కాశిమ్ జోమార్ట్ ఆదేశాలు ఇచ్చారు.

ఎలాంటి హెచ్చరికలూ లేకుండానే కాల్పులు జరపమని సైన్యాన్ని ఆయన ఆదేశించారు.

దేశ ప్రధాన నగరం అల్మాటీలో చెలరేగిన అల్లర్లను అణచివేసే ప్రయత్నంలో 26 మంది ప్రదర్శనకారులను కాల్చి చంపామని ప్రభుత్వ బలగాలు చెబుతున్నాయి. మరోవైపు 18 మంది భద్రతా అధికారులు కూడా ఈ ఘర్షణల్లో చనిపోయారని, వందల మంది గాయపడ్డారని అంటున్నారు.

ఈ ఘర్షణలు మొదలవడానికి కారణం - ఇంధన ధరల పెంపు. ఎల్‌పీజీ ధరలపై సబ్సిడీని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వాటి ధరలు రెండింతలయ్యాయి. దాంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)