మడగాస్కర్‌లో తీవ్రమైన కరవు, ఆకలితో అల్లాడుతున్న చిన్నారులు

వీడియో క్యాప్షన్, మడగాస్కర్‌లో తీవ్రమైన కరవు, ఆకలితో అల్లాడుతున్న చిన్నారులు
ప్రచురణ

మడగాస్కర్... ఆఫ్రికా ఖండంలోని ఒక చిన్న దేశం. ఈ దేశంలోని ప్రజలు ఇప్పుడు ఆకలితో అలమటించి పోతున్నారు.

తిండి లేక చిన్న పిల్లలు చావుకు చేరువ అవుతున్నారు. ఇంతటి దయనీయ పరిస్థితికి యుద్ధాలు, ఘర్షణలు కారణం కాదు.

దీనికి పూర్తిగా పర్యావరణ మార్పులే కారణం.

మడగాస్కర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల కరవు కాటకాల్లో చిక్కుకున్న తొలి దేశంగా నిలిచింది.

ఇక్కడ నాలుగేళ్లుగా వానలు లేవు. తక్షణమే సాయం అందించకుంటే ఆకలి చావులు చూడాల్సి వస్తుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)