పాకిస్తాన్ మార్కెట్లలో కారు చౌకగా అమెరికా యుద్ధ సామగ్రి

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ మార్కెట్లలో కారు చౌకగా అమెరికా యుద్ధ సామగ్రి
ప్రచురణ

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా తన సేనలను పూర్తిగా ఉపసంహరించుకుంది.

అమెరికా సేనలు ఉపసంహరణ మొదలు కాగానే తాలిబాన్ల దూకుడు పెంచి దేశం మొత్తాన్నీ తమ అధీనంలోకి తీసుకున్నారు.

అయితే, అమెరికా తన సేనల కోసం పెద్ద ఎత్తున కుమ్మరించిన సైనిక సామగ్రి అప్గానిస్తాన్‌‌లో ఉండిపోయింది.

ఆయుధాలు, మిలటరీ బూట్లు, నైట్ విజన్ కళ్లద్దాలు ఒకటేమిటి ఎన్నో అత్యాధునిక, అత్యంత నాణ్యమైన సైనిక సామగ్రి అఫ్గానిస్తాన్‌లో వదిలేసి వెళ్లారు అమెరికా సైనికులు.

అందులో చాలా వరకు రకరకాల మార్గాలలో పాకిస్తాన్ చేరుతున్నాయి. లాహోర్ మార్కెట్లలో యూఎస్ తయారీ మిలటరీ బూట్లు, తుపాకులు, మరెన్నో కారు చౌకగా విక్రయిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)