You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సెప్టెంబర్ 11 దాడులు: నాలుగు విమానాలు, 102 నిమిషాలతో చరిత్ర గతినే మార్చిన ఉగ్రదాడి
అమెరికాలో నాలుగు విమానాలను హైజాకర్లు ఒకేసారి హైజాక్ చేశారు.
ఆ విమానాలను న్యూయార్క్, వాషింగ్టన్‌లోని ప్రముఖ భవనాలను కూల్చడానికి ఉపయోగించారు.
రెండు విమానాలు న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం (వరల్డ్ ట్రేడ్ సెంటర్)లోకి దూసుకెళ్లాయి.
మొదటి విమానం అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 8.46కు నార్త్ టవర్‌ను ఢీకొనగా, రెండో విమానం ఉదయం 9.03 నిమిషాలకు సౌత్ టవర్‌లోకి దూసుకెళ్లింది.
దాంతో, ఆ భవనాల్లో మంటలు చెలరేగాయి. పై అంతస్తుల్లో ఉన్నవారు ఆ మంటల్లో చిక్కుకుపోయారు. ఆ భవనాల నుంచి వచ్చిన దట్టమైన పొగ నగరాన్నంతా కప్పేసింది.
విమానాలు భవనాలను ఢీకొట్టిన రెండు గంటల్లోనే రెండు టవర్లలోని 110 అంతస్తుల భవనాలను భారీ ధూళి మేఘాలు కమ్మేశాయి.
ఉదయం 9.37 నిమిషాలకు మూడో విమానం పెంటగాన్(అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం) పశ్చిమం వైపు భాగాన్ని ధ్వంసం చేసింది.
నాలుగో విమానం ఉదయం 10.03 నిమిషాలకు పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఆ విమానంతో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనాన్ని ఢీకొట్టాలని హైజాకర్లు ప్రణాళిక వేసినట్లు చెబుతారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)