పంజ్‌షీర్ లోయ తమ వశమైందన్న తాలిబాన్.. తమ పోరాటం ఆగలేదన్న ఎన్ఆర్ఎఫ్

వీడియో క్యాప్షన్, పంజ్‌షీర్ లోయ తమ వశమైందన్న తాలిబాన్.. తమ పోరాటం ఆగలేదన్న ప్రతిఘటన బలగాలు..
ప్రచురణ

పంజ్‌షీర్‌లో తాలిబాన్‌లు తమ జెండా ఎగురవేశారు. ఇప్పటివరకు తమకు పట్టుచిక్కని ఈ ప్రాంతాన్ని అధీనంలోకి తెచ్చుకునేందుకు తాలిబాన్లు కొద్దిరోజులుగా అక్కడి నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గాన్(ఎన్ఆర్ఎఫ్)తో భీకర పోరు సాగిస్తున్నారు.

ఈ పోరులో విజయం సాధించామని తాలిబాన్‌లు తాజాగా మరోసారి ప్రకటించారు.

పంజ్‌షీర్‌లో తమ ఫైటర్లు జెండా ఎగురవేస్తున్న దృశ్యాలను తాలిబాన్‌లు విడుదల చేశారు.

అయితే, తాము ఇంకా పోరాడుతున్నామని ఎన్ఆర్ఎఫ్ ఫైటర్లు చెబుతున్నారు.

ఎన్ఆర్ఎఫ్ నాయకుడు అహ్మద్ మసూద్ తాజాగా విడుదల చేసిన ఓ ఆడియో సందేశంలో అంతర్జాతీయ సమాజంపై విమర్శలు చేశారు. తాలిబాన్లకు ఆమోదం పలుకుతూ వారు రాజకీయంగా, సైనికపరంగా ఆత్మవిశ్వాసం పెంచుకునేలా అంతర్జాతీయ సమాజం వ్యవహరిస్తోందని మసూద్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)