కశ్మీర్ ముస్లింల కోసం గళం వినిపిస్తాం: తాలిబాన్లు

ప్రచురణ

జమ్ముకశ్మీర్ ముస్లింల కోసం గళం వినిపించే హక్కు తమకు ఉందని తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ అన్నారు.

బీబీసీకి జూమ్‌లో వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన సుహైల్ షాహీన్ అమెరికాతో జరిగిన దోహా ఒప్పందం గురించి మాట్లాడుతూ.. ఏ దేశానికి వ్యతిరేకంగానైనా సాయుధ ఆపరేషన్లు నిర్వహించడం తమ విధానంలో భాగం కాదన్నారు.

"ఒక ముస్లింగా భారత్‌లోని కశ్మీర్ లేదా ఇతర దేశాల్లో ఉంటున్న ముస్లింల కోసం గళం వినిపించే హక్కు మాకు ఉంది" అని దోహా నుంచి మాట్లాడిన షాహీన్ అన్నారు.

"మేం మా గళం వినిపిస్తాం. ముస్లింలు మీ వారే, మీ దేశ పౌరులే, మీ చట్టం ప్రకారం వారు కూడా సమానమేనని చెబుతాం" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)