ఇన్నాళ్లూ అమెరికా సైన్యం కోసం పనిచేశాను.. ఇప్పుడు నా కుటుంబాన్ని కాపాడండి

ప్రచురణ

తమ చివరి బలగాలతో అమెరికా విమానం వెళ్లిపోయిన వెంటనే, కాబుల్‌లోని హమిద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విమానాశ్రయంలో తాలిబాన్లు తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంతోషంతో తాలిబాన్ ఫైటర్లు తుపాకులు పేలుస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

అయితే, అమెరికా కోసం ఇన్నాళ్లూ పనిచేసిన కొందరు మాత్రం అఫ్గానిస్తాన్ నుంచి బయటపడలేకపోయారు.

వారిప్పుడు తాలిబాన్లు తమను ఏం చేస్తారో అని ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)