అఫ్గానిస్తాన్‌లో నిరసనకారులపై తాలిబాన్ల కాల్పులు

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో నిరసనకారులపై తాలిబాన్ల కాల్పులు
ప్రచురణ

జలాలాబాద్ అఫ్గానిస్తాన్‌ తూర్పు ప్రాంతంలో ఉంటుంది. ఇది దేశంలో ఐదో అతిపెద్ద నగరం.

రాజధాని కాబుల్ నగరానికి దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఆగస్టు 18న జలాలాబాద్‌లోని ఒక స్క్వేర్‌లో అఫ్గానిస్తాన్ జాతీయ పతాకాన్ని ఎగరేయబోయిన నిరసనకారులపై తాలిబాన్లు కాల్పులు జరిపారని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

ఈ కాల్పులు, ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో పదుల సంఖ్యలో గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)