పాకిస్తాన్‌లోని ఆలయంపై దాడి, భయంతో తరలిపోతున్న హిందువులు

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని ఆలయంపై దాడి, భయంతో తరలిపోతున్న హిందువులు
ప్రచురణ

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ దేవాలయంపై కొందరు దాడి చేసి, విగ్రహాలు ధ్వంసం చేశారు.

రహీమ్ యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ షరీఫ్‌లో ఆగస్ట్ 4, బుధవారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. పరిస్థితులను అదుపు చేసేందుకు భారీ పోలీసుల బలగాలను, రేంజర్లను మోహరించారు.

ఈ సంఘటన అనంతరం అక్కడ ఉన్న హిందువులు ఆ ప్రాంతం విడిచి పారిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

కొద్దిమంది వ్యక్తులు మతపరమైన ఘర్షణలకు పాల్పడి శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలీసులు తెలిపారు.

వీరిని ప్రేరేపించి, దాడులకు ప్రోత్సహించినవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ ఘటనలో మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

పాకిస్తాన్ సుప్రీం కోర్టు కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది. పోలీసులను మందలించడంతో పాటు ఆలయ మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని, దోషులను సత్వరమే అరెస్ట్ చేయాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)