శ్రీలంక: మంటల్లో చిక్కుకున్న ఈ నౌక పర్యావరణానికి హాని చేస్తుందా...

ప్రచురణ

ఎక్స్‌ప్రెస్ పెరల్ రెండు వారాల కిందట మంటల్లో చిక్కుకుంది. ఇప్పుడు మునిగిపోతోంది. శ్రీలంక పశ్చిమ తీరం వద్ద ఈ నౌక సముద్ర గర్భాన్ని తాకింది. అందువల్ల.. నౌకను దూరంగా లాక్కెళటానకి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

నౌకలో తరలిస్తున్న కోట్లాది ప్లాస్టిక్ పెల్లెట్స్ ఇప్పటికే శ్రీలంక సముద్ర జలాలు, బీచ్‌లను ముంచెత్తాయి.

వీటిని తొలగించే పనులు జరుగుతున్నాయి. కానీ చాలా చిన్నగా ఉండే ఈ ప్లాస్టిక్ పెల్లెట్లను సముద్ర జీవులు ఆహారంగా భావించి తింటుంటాయి.

ఇప్పుడు ఆయిల్ లీకవుతుందేమోననే భయం మొదలైంది.

నౌకలో సుమారు 350 టన్నుల చమురు ఉంది. అందులో ఎంత కాలిపోయిందో తెలియదు.

ఇంత పర్యావరణ నష్టాన్ని శ్రీలంక ఎన్నడూ చూడలేదు. ప్లాస్టిక్ పెల్లెట్లతో పాటు, ప్రమాదకరమైన కెమికల్స్, టాక్సిన్స్ లీకయ్యాయి. దీనివల్ల పర్యావరణ విధ్వంసం నాలుగు రెట్లు పెరుగుతుంది.

ఇది తమ బతుకుదెరువుపై గట్టి దెబ్బంటూ స్థానిక నెగొంబో పట్టణ జాలర్లు, చేపల వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)