You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బుర్కినా ఫాసో: 132 మందిని కాల్చి చంపిన సాయుధులు, మృతుల్లో ఏడుగురు చిన్నారులు
ఆఫ్రికాలోని ఉత్తర బుర్కినా ఫాసోలో యాఘా ప్రాంతంలోని ఒక గ్రామంపై దాడి చేసిన సాయుధులు కాల్పులు జరపడంతో 132 మందికి పైగా చనిపోయారని ఆ దేశ అధికారులు చెప్పారు.
మృతుల్లో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
దాడి చేసిన సాయుధులు దాదాపు వంద మందిని హతమార్చారని అంతకు ముందు ఆ దేశ అధ్యక్షుడు రోషె కాబోర్ తెలిపారు.
సోల్హాన్ గ్రామంపై శుక్రవారం రాత్రి సాయుధులు దాడిచేసి ఇళ్లు, మార్కెట్లను తగులబెట్టారని ప్రభుత్వ అధికారులు చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
ఈ దాడులకు తెగబడింది తామేనని ఇప్పటివరకు ఏ వార్తా సంస్థా ప్రకటించలేదు.
అయితే, ఇక్కడ ఇస్లామిక్ దాడులు ఎప్పటికప్పుడే జరుగుతుంటాయి. ముఖ్యంగా నీజర్, మాలి సరిహద్దుల్లోని ప్రాంతాలపై ఈ దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ దాడిని ఖండించారు.
"నేను ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. హింసాత్మక ఉగ్రవాదాన్ని, దాని వల్ల సంభవించే మరణాల నుంచి బయటపడ్డానికి అంతర్జాతీయ సమాజం మన సభ్య దేశాలకు ఇచ్చే సాయాన్ని వీలైనంత త్వరగా రెట్టింపు చేయాలి" అన్నారు.
బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోషె కాబోర్ దేశంలో మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు.
"దుష్ట శక్తులకు వ్యతిరేకంగా మనమంతా కలిసి దృఢంగా నిలబడాలి" అని ఆయన ఒక ట్వీట్ చేశారు.
గ్రామంపై దాడి చేసిన వారి కోసం తమ భద్రతా బలగాలు వెతుకుతున్నాయని ఆయన చెప్పారు.
మరోవైపు శుక్రవారం రాత్రే సోల్హాన్‌కు ఉత్తరంగా 150 కి.మీ. దూరంలోని తదర్యత్ గ్రామంలో 14 మందిని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు.
గత నెలలో కూడా తూర్పు బుర్కినా ఫాసోలో జరిగిన దాడిలో 30 మంది మరణించారు.
2012లో ఉత్తర మాలిలోని కొన్ని ప్రాంతాలను సాయుధులు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచీ ఇక్కడ హింస చెలరేగుతోంది.
మాలి, చాద్, మారిటానియా, నైజర్, బుర్కినా ఫాసోల్లోని మిలిటెంట్లతో పోరాడుతున్న బలగాలకు ఫ్రాన్స్ బలగాలు సాయం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)