ఎలాన్‌ మస్క్‌: నాకు ఆస్పర్గర్స్ సిండ్రోమ్ ఉంది.. అందుకే నా ఆలోచనా తీరు అలా ఉంటుంది

ప్రచురణ

తనకు ఆస్పర్గర్స్ సిండ్రోమ్ ఉందని టెస్లా, స్పేస్‌ ఎక్స్ కంపెనీల అధిపతి ఎలాన్ మస్క్ ఒక టీవీ షోలో చెప్పారు.

ట్విటర్‌లో తాను పెట్టే పోస్టుల గురించి చాలా మంది వేళాకోళం చేశారని, విమర్శించారని ప్రస్తావించారు.

"నేను అప్పుడప్పుడు కొన్ని వింత పోస్టులు పెడుతుంటానని నాకు తెలుసు. కానీ, నా మెదడు అలాగే పనిచేస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

"నా వల్ల ఎవరైనా నొచ్చుకొని ఉంటే.. వారికి నేను ఎలక్ట్రిక్ కార్లను కొత్తగా కనిపెట్టానని, రాకెట్ ద్వారా మనిషిని అంగారక గ్రహంపైకి పంపించబోతున్నానని మళ్లీ చెప్పాలనుకుంటున్నా. నేను సాధారణ వ్యక్తినని మీకు అనిపిస్తోందా?" అని ప్రశ్నించారు.

ఇంతకూ ఆస్పర్గర్స్ సిండ్రోమ్ అంటే ఏమిటి? దీని లక్షణాలు ఏమిటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)