జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో పోలీసు అధికారిని దోషిగా తేల్చిన కోర్టు

వీడియో క్యాప్షన్, జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో పోలీసు అధికారిని దోషిగా తేల్చిన కోర్టు
ప్రచురణ

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి డెరెక్ చావిన్‌ను కోర్టు దోషిగా గుర్తించింది. నిరుడు మినియాపోలిస్‌లో ఫ్లాయిడ్‌ మెడను ఆయన తొమ్మిది నిమిషాలకు పైగా తొక్కిపెట్టిన వీడియో ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలచివేసింది.

ఫ్లాయిడ్ మరణానికి సంబంధించి సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్, హత్య అనే మూడు అభియోగాల్లోనూ చావిన్‌ను కోర్టు దోషిగా తేల్చింది. బెయిల్‌ను వెంటనే రద్దు చేసింది.

పోలీసులు చావిన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనకు ఏ శిక్ష విధిస్తారన్నది రెండు నెలల్లో తేలనుంది. నిరూపితమైన నేరాలను బట్టి ఆయన దశాబ్దాల తరబడి జైల్లో గడపాల్సి రావచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)