చేతులు ఇలా కడుక్కుంటే చాలా వరకు కరోనావైరస్ బారిన పడకుండా ఉండొచ్చు
కరోనాను తప్పించుకోవడానికి పదే పదే చేతులు శుభ్రంగా కడుక్కోవడమే మార్గమని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అసలు చేతులెలా పరిశుభ్రం చేసుకోవాలి? దానివలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి?
ప్రతి వ్యక్తీ తన చేతులను సబ్బు తోగానీ, ఇతర డిసిన్ఫెక్టంట్ ద్రావణంతో గానీ రుద్ది, తోమి.. తేటగా వుండే చన్నీళ్లతో గానీ, వేడినీటితో గానీ కడుక్కుని.. పొడి బట్టతో తుడుచుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి చేతులు పరిశుభ్రంగా వున్నాయని అర్థం.
మామూలుగా నీళ్లతో మాత్రమే కడుక్కుంటే అవి పరిశుభ్రం కావు, ఏ ప్రయోజనమూ ఉండదు.
చేతులు శుభ్రం చేసుకోవడం వలన కలిగే ఉపయోగాలు...
చేతులపై వుండే దుమ్మూ, ధూళితో పాటు జిడ్డూ, కంటికి కనపడని అనేక వ్యాధి కారక క్రిములు కూడా తొలగిపోతాయి, ఆ విధంగా అనేక వ్యాధులు రాకుండా నివారించవచ్చు.
ఏఏ వ్యాధుల్ని అరికట్టొచ్చు?
- జలుబు (సాధారణంగా వచ్చేది)
- ఫ్లూ జ్వరం, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లూ
- విరోచనాలు
- కలరా
ఫీకో ఓరల్ కంటామినేషన్ వల్ల వచ్చే వ్యాధులు. అంటే మలంలో వుండే సూక్ష్మ జీవులు నోటికి తగలడం వలన వచ్చే వ్యాధులు. ఉదాహరణకు హెపటైటిస్ ఎ, నులి పురుగులు వంటి ఇతర పురుగులు కడుపులో చేరడం.
ఇంకా అనేక బాక్టీరియాల ద్వారా సంక్రమించే అంటు వ్యాధులను కూడా నివారించవచ్చు. అందుకే వైద్య శాస్త్రంలో ప్రతి చిన్న ప్రొసీజర్‌కీ ముందూ, వెనకా చేతులు కడుక్కోవడం తప్పనిసరి.
ప్రతి రోజూ తప్పనిసరిగా చేతులు కడుక్కోవలసిన సమయాలు
- వంట వండే ముందూ, వండిన తర్వాతా
- ఆహారం తీసుకునే ముందూ, తీసుకున్న తర్వాతా
- మాంసమూ, చేపలూ మొదలయిన నాన్ వెజ్ పదార్థాలు శుభ్రం చేసేముందూ, చేసిన తర్వాతా
- మల విసర్జన తర్వాత
- పిల్లల డైపర్స్ మార్చే ముందూ, తర్వాతా
- పిల్లలకు ఆహారం పెట్టే ముందూ, తర్వాతా
- సబ్బుతోనూ, నీళ్లతోనూ చేతులు శుభ్ర పరుచుకోవాలి.
మామూలుగా సబ్బు అందుబాటులో లేకపోతే కొన్ని ప్రదేశాలలో, మసి గానీ, ఇసుక గానీ సబ్బుకి ప్రత్యామ్నాయంగా వాడవచ్చునని చెబుతున్నారు. మసిని చేతులకు రుద్దుకుని, నీళ్లతో కడుక్కున్నపుడు ఒక ఆల్కలైన్ మీడియమ్ యేర్పడి మలినాలని శుభ్రపరుస్తుంది.
సబ్బుల్లో సాలిడ్ సోప్ కంటే లిక్విడ్ సోప్ వాడటం ఉత్తమం. ఎందుకంటే సాలిడ్ సోప్ పైన మన చేతుల నుండీ చేరిన బాక్టీరియా నిల్వ ఉండే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
- మధ్యప్రదేశ్: ఆదివాసీ బాలిక, యువకుడిని కట్టేసి ఊరేగించారు.. అసలేం జరిగింది?
- దిల్లీ, మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ: ‘కరోనా నైట్ షిఫ్ట్ చేసి పగలు నిద్రపోతుందా..?’ రాత్రి కర్ఫ్యూ పెట్టడంలో లాజిక్ ఏమిటి..
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- చైనా వ్యాక్సీన్: తమ కోవిడ్ టీకాలు ఎక్కువ రక్షణ అందించలేవన్న చైనా అధికారి
- గోల్డెన్ బ్లడ్: ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- సిపాయిల తిరుగుబాటు: భారత సైనికులను బలవంతంగా క్రైస్తవులుగా మారుస్తున్నారని వదంతులు వచ్చినప్పుడు ఏం జరిగింది?
- ఎడారి ఇసుక నేలలో పచ్చని పొలం... ఈ అద్భుతం ఎలా సాధ్యం?
- కరోనావైరస్: తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సీన్ వేస్టేజీ ఎక్కువగా ఉందా... ప్రధాని మోదీ ఆ మాట ఎందుకు అన్నారు?
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- మాస్క్ చరిత్ర: 17వ శతాబ్దం నాటి కాకి ముక్కు మాస్క్ నుంచి నేటి కోవిడ్-19 మాస్క్ వరకు...
- సింధు నదీజలాల ఒప్పందం వల్ల భారత్ నష్టపోతోందా.. అసలు ఎందుకీ ఒప్పందం చేసుకున్నారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)