ప్రిన్స్‌ ఫిలిప్‌ : రాణికి కొండంత అండ

వీడియో క్యాప్షన్, ప్రిన్స్‌ ఫిలిప్‌ 99 ఏళ్ళ వయసులో కన్నుమూత, ప్రకటించిన బకింగ్‌‌హమ్‌ ప్యాలెస్‌
ప్రచురణ

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ మరణించినట్లు బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ప్రకటించింది. ఆయన వయసు 99 సంవత్సరాలు.

"రాణి ఎంతో విషాదంతో తన భర్త 'డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బరా ప్రిన్స్ ఫిలిప్' మరణించినట్లు తెలిపారు" అని బకింగ్‌హమ్ ప్యాలెస్ ఒక ప్రకటన చేసింది.

"విండ్సర్ కోటలో హిజ్‌ రాయల్‌ హైనెస్‌ ప్రిన్స్ ఫిలిప్ ఈ ఉదయం ప్రశాంతంగా కన్నుమూశారు." అని ఆ ప్రకటనలో తెలిపారు.

ప్రిన్సెస్‌ ఎలిజబెత్‌ను ప్రిన్స్‌ ఫిలిప్‌ 1947లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు ఎలిజబెత్‌ బ్రిటన్‌ రాణి అయ్యారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)