సూయెజ్ కెనాల్‌లో ఇరుక్కున్న భారీ నౌక వల్ల రోజూ 70 వేల కోట్ల నష్టం

ప్రచురణ

సూయజ్‌ కాలువలో ఇరుక్కుపోయిన 'ఎవర్‌ గివెన్‌' షిప్‌ను బయటికి తీసేందుకు రోజులు లేదంటే వారాలు కూడా పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ షిప్ తైవాన్‌లోని 'ఎవర్‌గ్రీన్‌ మెరైన్‌' అనే సంస్థకు చెందినది. సూయజ్‌ కాలువలోని దక్షిణపు ఒడ్డువైపున ఇది ఇసుకలో కూరుకుపోయింది. ఇది కాలువకు అడ్డంగా ఉండటంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన అనేక నౌకలు ఆగిపోయాయి.

దీంతో సరకు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోజుకు సుమారు 9.6 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 70 వేల కోట్ల నష్టం జరుగుతోందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)