మియన్మార్ పోలీసులు: ‘నిరసనకారులపై కాల్పులు జరపాలనే ఆదేశాలను ధిక్కరించి పారిపోయి వచ్చాం’

వీడియో క్యాప్షన్, మియన్మార్ పోలీసులు: ‘నిరసనకారులపై కాల్పులు జరపాలనే ఆదేశాలను ధిక్కరించి పారిపోయి వచ్చాం’
ప్రచురణ

భారత్‌లోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో నదికి అవతలి వైపు మియన్మార్. దాదాపు 400 కిలోమీటర్ల మేర ఈ నదే రెండు దేశాలకు సరిహద్దుగా ఉంటుంది.

మియన్మార్‌లో సైనిక అణచివేతను తట్టుకోలేక ఈ నది గుండానే పారిపోయి భారత్‌కు వస్తున్నారు.

అలాంటి వారిలో కొందరు పోలీసు ఉద్యోగులను బీబీసీ కలిసింది. వారంతా 20ల్లో ఉన్నవారే. నిరసనకారులపై హింసను ప్రయోగించాలనే ఆదేశాలను ధిక్కరిస్తూ తమ దేశంలోంచి పారిపోయి వచ్చామని వారు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)