యెమెన్ విమానాశ్రయంలో పేలుడు

ప్రచురణ

దక్షిణ యెమెన్ నగరం ఏడెన్‌లోని విమానాశ్రయంలో విధ్వంసకర దాడి జరిగింది. భారీ పేలుడుకు ఇక్కడ 22 మంది మరణించారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.

ఇటీవల కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ ప్రతినిధులు సౌదీ అరేబియా నుంచి ఇక్కడకు విమానంలో వచ్చిన సమయంలో పేలుడు చోటుచేసుకుంది.

మరణించిన వారిలో ఎక్కువ మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. తనతోపాటు తన మంత్రి బృందం క్షేమంగానే ఉందని ప్రధాన మంత్రి ప్రకటించారు.

హౌతి తిరుగుబాటుదారులే ఈ దాడి చేపట్టారని సమాచార ప్రసార శాఖ మంత్రి ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)