వారిని చూసి నరమాంసభక్షకులు అనుకున్నారు.. ఇప్పుడు వారే తిండి పెడుతున్నారు

వీడియో క్యాప్షన్, ఆశ్రయం ఇచ్చిన దేశానికి ఆహారం అందిస్తున్న శరణార్థులు
ప్రచురణ

తమకు ఆశ్రయం ఇచ్చిన దేశానికి ఆహారం అందిస్తున్న శరణార్థులు వీరు.

లావోస్‌కు చెందిన హమాంగ్ ప్రజలు 1960, 70లలో శరణార్థులుగా మారారు.

వియత్నం యుద్ధంతో చెలరేగిన హింస తమ దేశానికి వ్యాపించినప్పుడు వారు అమెరికా తరఫున పోరాడడంతో కమ్యూనిస్టులకు లక్ష్యంగా మారారు.

దాంతో ఫ్రాన్స్ తన అధీనంలో ఉన్న ఫ్రెంచ్ గయానాకు వారిని తరలించింది.

తమ దేశానికి 16 వేల కిలోమీటర్ల దూరంలోని కొత్త దేశంలో వారు కొత్త సవాళ్లను ఎదుర్కొన్నారు.

స్థానికులు వారిని చూసి నరమాంస భక్షకులు అనుకున్నారు.

చివరికి వారు అక్కడ ఎలా కుదురుకున్నారు.. ఆ దేశానికి ఆహారం అందించేవారిగా ఎలా మారారన్నది ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)