స్విత్లానా టిఖనోస్కాయా: 9 నెలల కిందట సాధారణ గృహిణి.. నేడు దేశాధ్యక్షుడిని ఓడించారు

వీడియో క్యాప్షన్, స్విత్లానా టిఖనోస్కాయా: 9 నెలల కిందట సాధారణ గృహిణి.. నేడు దేశాధ్యక్షుడిని ఓడించారు
ప్రచురణ

‘‘తొమ్మిది నెలల కిందట ఒక సగటు భార్యని, ఒక సగటు తల్లిని. ప్రత్యేకత ఏమీ లేదు. ఆసక్తికరంగా ఉన్నదీ ఏదీ లేదు. కానీ అతి త్వరలో ఇదంతా మారిపోతుందని ఏమాత్రం అనుకోలేదు’’ అంటున్నారు స్విత్లానా టిఖనోస్కాయా.

డెమొక్రటిక్ బెలారస్ పార్టీ నాయకురాలామె. ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో బెలారస్ అధ్యక్షురాలిగా గెలిచారు.

సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా కొనసాగిన అలెగ్జాండర్ లుకాషెంకాపై ఆమె విజయం సాధించారు. లిథ్వేనియాలో అజ్ఞాతంలో ఉన్న ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)