టర్కీలో భూకంపం.. కూలిన భవనాలు

వీడియో క్యాప్షన్, టర్కీలో భూకంపం.. కూలిన భవనాలు
ప్రచురణ

టర్కీలోని ఏజియన్ తీర ప్రాంతంలోనూ, గ్రీస్‌లోని సామోస్ దీవిలోనూ భారీ భూకంపం సంభవించింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయని.. భూకంప కేంద్రం టర్కీలోని ఇజ్మిర్ ప్రావిన్స్‌లో ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

టర్కీ అధికార వర్గాలు మాత్రం 6.6 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు చెబుతున్నాయి. ఇజ్మిర్ నగరంలో ఇప్పటివరకు 20 మంది మరణించారని, 786 మంది గాయపడ్డారని అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గ్రీస్‌కు చెందిన సామోస్ దీవిలో ఇద్దరు మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)