అరుదైన కుక్కపిల్ల.. ఆకుపచ్చ రంగులో పుట్టింది
ఇటలీకి చెందిన ఒక రైతు ఇంట్లో పెంపుడు కుక్క.. ఆకుపచ్చ రంగులో ఉన్న ఓ కుక్క పిల్లకు జన్మనిచ్చింది.
మధ్యధరా సముద్రంలోని సార్డీనియా దీవిలో నివసించే క్రిస్టియన్ మల్లోచ్చీ అనే ఆ రైతుకు చెందిన స్పెలాచ్చియా అనే కుక్కకు ఇటీవల ఐదు పిల్లలు పుట్టాయి. అందులో ఒకటి లేత ఆకుపచ్చ రంగులో ఉండటం చూసి అందరూ అబ్బురపడ్డారు.
ఆ పప్పీకి వెంటనే పిస్తాచియో అని పేరు కూడా పెట్టారు. పిస్తాచియోతో పాటు పుట్టిన మిగతా నాలుగు కుక్కపిల్లలకి వాటి తల్లి రంగైన తెల్లటి బొచ్చే వచ్చింది.
ఆకుపచ్చ రంగుతో కుక్కలు పుట్టటం చాలా అరుదు. పిస్తాచియో తల్లి కుక్క కడుపులో ఉన్నపుడు బిలివెర్డిన్ అనే ఆకుపచ్చ పిగ్మెంట్ తాకటం వల్ల దానికి ఈ రంగు వచ్చినట్లు భావిస్తున్నారు.
అయితే.. పిస్తాచియో రంగు అప్పుడే వెలిసిపోవటం కూడా మొదలవటం చూసి చాలా మంది విచారిస్తున్నారు.
పిస్తాచియో సహా కుక్కపిల్లలన్నిటినీ.. తన పొలంలో గొర్రెలు కాసే వారికి ఇచ్చేయాలని మల్లోచ్చీ నిర్ణయించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- టర్కీ డ్రోన్ సూపర్ పవర్‌గా ఎలా మారింది?
- NBSA: భారత న్యూస్ చానళ్లకు నోటీసులు... క్షమాపణలు చెప్పాలని ఆదేశం
- హాథ్రస్ నిజాలు సమాధి అవుతున్నాయా... బాధితురాలి గ్రామంలో ఏం జరుగుతోంది?
- బొబ్బిలి అంటే వీరత్వమే కాదు వీణ కూడా.. తంజావూరు తరువాత ఈ తెలుగు వీణకే పట్టం
- అజర్బైజాన్, అర్మేనియా: కాల్పుల విరమణను అజర్బైజాన్ సైనిక సన్నాహాలకు ఉపయోగించుకుందా
- పాకిస్తాన్‌లోని హిందూ ఆలయంలో విగ్రహాల ధ్వంసం
- కృష్ణా, గోదావరి పరవళ్లు.. దశాబ్దం తర్వాత మళ్లీ నిండుకుండల్లా ప్రాజెక్టులు
- కరోనావైరస్: బ్రెజిల్లో లక్ష దాటిన కోవిడ్ మరణాలు... భారత్ కూడా అలాంటి తప్పులే చేస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)