You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెరికాలో ఈ ఈగ ఎందుకు ట్రెండవుతోంది?
అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు కమలా హారిస్, మైక్ పెన్స్ మధ్య సాల్ట్ లేక్ సిటీలో డిబేట్ జరుగుతోంది.
అధ్యక్షుడు ట్రంప్ కరోనా పాజిటివ్ అయిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఈ అభ్యర్థుల మధ్య జరిగే ఈ చర్చ చాలా కీలకంగా నిలిచింది.
ఉపాధ్యక్ష అభ్యర్థుల మధ్య ఈ చర్చను జర్నలిస్ట్ సుజాన్ పేజ్ నిర్వహిస్తున్నారు.
కరోనా దృష్ట్యా అభ్యర్థుల మధ్య ఒక గ్లాస్ షీల్డ్ ఏర్పాటుచేశారు. అభ్యర్థులకు, హోస్ట్ కు మధ్య ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ చర్చకు హాజరైన ప్రేక్షకులందరికీ కోవిడ్ టెస్ట్ చేశారు. చర్చ జరుగుతున్న సమయంలో అందరూ మాస్క్ వేసుకోవడం, ఫిజికల్ డిస్టన్స్ పాటించడం తప్పనిసరి చేశారు.
90 నిమిషాల ఈ చర్చను వివిధ భాగాలుగా విభజించారు.
అయితే ఈ చర్చలో అందరికంటే ఎక్కువగా ఆకర్షించింది మాత్రం మైక్ పెన్స్ తలపై వాలిన ఒక ఈగ.
గతంలో హిల్లరీ క్లింటన్‌పైన కూడా ఈగ వాలిందని, ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారని, ఈగ ఎవరిపై వాలితే వాళ్లు ఓడిపోతారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కమలా హారిస్ - మైక్ పెన్స్ హోరాహోరీగా సంవాదంలో గెలుపెవరిది?
- ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేది ఎప్పుడు?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- 'కరోనావైరస్ తొలి వ్యాక్సీన్ మేం తయారు చేశాం... నా బిడ్డకు కూడా టీకా ఇచ్చాం' - రష్యా అధ్యక్షుడు పుతిన్
- ‘‘దేశ ప్రజలకు ప్రత్యక్ష నగదు సహాయం చేయాలి’’: మన్మోహన్ మూడు సలహాలు
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- శ్రీరాముడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అసోం ప్రొఫెసర్‌పై కేసు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- ’గాంధీ కళ్లద్దాల విలువ చెప్పినప్పుడు.. వాటి యజమానికి గుండె ఆగినంత పనైంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)