ఆఫ్రికా ఖండంలో కరోనావైరస్ కేసులు, మరణాలు తక్కువగా ఉన్నాయి.. ఎందుకు?

వీడియో క్యాప్షన్, కరోనా
ప్రచురణ

ఆఫ్రికా ఖండంలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్ రేటు, మరణాల రేటు మొదట్లో నిపుణులు అంచనా వేసినదాని కన్నా తక్కువగా ఉన్నాయి. ఎందుకు?

ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కొనేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.

దక్షిణాఫ్రికా దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య బాగా పడిపోయింది. మిగతా ప్రాంతాలతో పోల్చితే ఆఫ్రికా వ్యాప్తంగా పరిస్థితి తీవ్రత తక్కువగానే ఉంది.

జన సాంద్రత ఎక్కువగా ఉండే ఆవాసాలు, అపరిశుభ్రత ఈ పరిస్థితికి ఏమైనా కారణమా అనే అంశంపై పరిశోధకులు దృష్టి పెట్టారు.

ఆఫ్రికాలో చాలా పట్టణాల్లోని దుర్భరమైన జీవన పరిస్థితుల కారణంగా కరోనావైరస్ వ్యాప్తి వేగం బాగా పెరగొచ్చని కొన్ని నెలలుగా ఆరోగ్య నిపుణులు అంచనాలు వేస్తూ వచ్చారు.

''జన సాంద్రత చాలా ప్రధానమైన అంశం. సామాజిక దూరం పాటించే అవకాశమే లేకపోతే, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది'' అని దక్షిణాఫ్రికా కోవిడ్19 మార్గదర్శక బృందం సారథి ప్రొఫెసర్ సలీం అబ్దుల్ కరీం అన్నారు. వాస్తవ పరిస్థితి ఈ వాదనకు విరుద్ధంగా ఉంది.

దక్షిణాఫ్రికాలో, మిగతా ప్రాంతాల్లో త్వరగానే కఠినమైన లాక్‌డౌన్‌లు విధించడం బాగా ఉపకరించింది. మాస్క్‌ల ప్రాధాన్యం గురించి బాగా ప్రచారం చేయడం, ఆక్సిజన్ లభ్యత ఉండేలా చూసుకోవడం మేలు చేశాయి.

మిగతా ప్రాంతాలతో పోలిస్తే, ఆఫ్రికాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం కరోనావైరస్ కట్టడికి తోడ్పడిందనే వాదనలూ ఉన్నాయి.

ఆఫ్రికాలో కరోనావైరస్ వ్యాప్తికి సమయం తీసుకుంటోందని, రాబోయే నెలల్లో పరిస్థితి తీవ్రం కావొచ్చని హెచ్చరిస్తున్నవారు కూడా ఉన్నారు.

ఆఫ్రికాలో పెనుముప్పును దాటేశామని తాను చెప్పలేనని, రాబోయే రోజుల్లో కరోనా విజృంభించే అవకాశాలు లేకపోలేదని ప్రొఫెసర్ కరీం అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)