బాలికను ఎగరేసుకుపోయిన భారీ గాలిపటం

వీడియో క్యాప్షన్, బాలికను ఎగరేసుకుపోయిన భారీ గాలిపటం
ప్రచురణ

ఈ వీడియోలో కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలచి వేయొచ్చు.

తైవాన్‌లో ఒక భారీ గాలిపటం మూడేళ్ల బాలికను గాల్లోకి లాక్కెళ్లింది.

పతంగి తోకలో చిక్కుకున్న బాలిక, పెను గాలికి పతంగితోపాటు గాల్లోకి వెళ్లిపోయింది.

బాలిక వంద అడుగులకు పైగా ఎత్తు వరకు వెళ్లిందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

దాదాపు 30 సెకన్ల అనంతరం పతంగి అదుపులోకి వచ్చాక బాలికను అక్కడున్నవారు దాని నుంచి విడిపించారని రాయిటర్స్ చెప్పింది.

హిసించు నగరంలో అంతర్జాతీయ గాలిపటాల పండగలోఈ ఘటన జరిగింది.

బాలికకు ప్రాణాపాయం తప్పింది. బాలిక ముఖానికి, మెడకు చిన్న గాయాలు అయ్యాయని స్థానిక మీడియా తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)