రూ. 2.55 కోట్లకు అమ్ముడుపోయిన మహాత్ముడి బంగారు కళ్లద్దాలు

వీడియో క్యాప్షన్, రూ. 2.55 కోట్లకు అమ్ముడుపోయిన మహాత్ముడి బంగారు కళ్లద్దాలు
ప్రచురణ

మహాత్మాగాంధీ కళ్లద్దాలు లండన్‌లో శుక్రవారం నిర్వహించిన వేలంలో 2,60,000 పౌండ్ల(సుమారు రూ. 2.55 కోట్లు) ధరకు అమ్ముడుపోయాయి.

బ్రిస్టన్‌లోని "ఈస్ట్‌ బ్రిస్టల్ ఆక్షన్స్'' అనే వేలం సంస్థ లెటర్‌ బాక్స్‌లో తెలుపు రంగు కవరులో చుట్టి పడేసి ఉన్న ఈ కళ్లద్దాలను ఆ సంస్థ ఉద్యోగి ఒకరు గుర్తించడంతో వెలుగులోకి వచ్చాయి.

ఇది తమ కంపెనీ చరిత్రలోనే అతి విలువైన వస్తువని వేలం సంస్థకు చెందిన అధికారి ఆండ్రూ స్టోవ్‌ అన్నారు.

"వాటి విలువ ఎంతో చెప్పినప్పుడు, దాని యజమానికి గుండె ఆగినంత పనైంది'' అని స్టోవ్‌ చెప్పారు.

"శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి వచ్చి ఈ కళ్లద్దాలను లెటర్‌ బాక్స్‌లో పెట్టారు. సోమవారం వరకు అతను అక్కడే వేచి ఉన్నారు. మా ఉద్యోగి ఒకరు ఆ కళ్లద్దాలను నాకు అందజేశారు. అందులో ఉన్న ఒక నోట్‌లో ఇవి గాంధీ కళ్లద్దాలు అని రాసి ఉంది'' అని స్టోవ్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)