అంతరిక్షం నుంచి సముద్రంలో సురక్షితంగా దిగిన నాసా-స్పేస్ ఎక్స్ వ్యోమగాములు

ప్రచురణ

స్పేస్ స్టేషన్ నుంచి విడిపోయిన డ్రాగన్ ఎండీవర్ కాప్స్యూల్‌ ద్వారా అమెరికా వ్యోమగాములు డగ్ హార్లీ, బాబ్ బెంకెన్ తిరిగి సురక్షితంగా భూమిని చేరుకున్నారు.

ఈ ఇద్దరు ఉన్న కాప్స్యూల్ అమెరికా ఈస్టర్న్ డేలైట్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 2.48 (భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి 12:18)కి ఫ్లోరిడా తీరంలో సముద్రంలో దిగింది.

వారికి స్వాగతం పలికి, తీసుకురావడానికి రికవరీ వాహనం సముద్ర జలాల్లోకి వెళ్లింది. 45 ఏళ్ల క్రితం అపోలో కమాండ్ మాడ్యూల్ ల్యాండింగ్ తర్వాత అమెరికా ఇప్పుడు మళ్లీ ఇలా నీటిలో వ్యోమగాములను దింపగలిగింది.

ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని హార్లీ వ్యాఖ్యానించారు.

"స్పేస్ ఎక్స్, నాసా తరపున మీ ఇద్దరికీ భూమిపైకి స్వాగతం. స్పేస్ ఎక్స్‌లో ప్రయాణించినందుకు ధన్యవాదాలు" అని స్పేస్ ఎక్స్ మిషన్ కంట్రోల్ వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)