సముద్రాన్ని ఈదుకుంటూ కరోనాను మోసుకొచ్చాడా?

వీడియో క్యాప్షన్, సముద్రాన్ని ఈదుకుంటూ కరోనాను మోసుకొచ్చాడు
ప్రచురణ

ఉత్తర కొరియాలో మొదటి కరోనావైరస్ రోగిగా అనుమానిస్తున్న వ్యక్తికి ఆ ఇన్ఫెక్షన్ లేదని దక్షిణ కొరియా అంటోంది.

ఆ వ్యక్తి దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాకు గత వారమే పారిపోయినట్లు భావిస్తున్నారు.

నిజానికి ఆయనది ఉత్తర కొరియానే.

మూడేళ్ల క్రితం అక్కడి నుంచి పారిపోయి దక్షిణ కొరియాకు వచ్చారు.

మళ్లీ వారం క్రితం స్వదేశానికి పారిపోయారు.

దక్షిణ కొరియాలోని గాంగ్వా ద్వీపం నుంచి ఈదుకుంటూ స్వదేశానికి ఆయన పారిపోయినట్లు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు.

సరిహద్దుకు సమీపంలోని గాంగ్వా ద్వీపానికి మొదట ఆ వ్యక్తి చేరుకున్నారని దక్షిణ కొరియా సైన్యం సోమవారం వెల్లడించింది.

గాంగ్వా ద్వీపం నుంచి యెల్లో సీ వరకు వెళ్లే ఓ డ్రైనేజీ పైపు ఉంది.

అందులో తీగల కంచె ఉన్నా, దాని కింద నుంచి ఆ వ్యక్తి పాక్కుంటూ వెళ్లినట్లు భావిస్తున్నారు.

ఆ తర్వాత యెల్లో సీలో ఓ మైలు దూరం ఈదుకుంటూ ఉత్తర కొరియాకు ఆయన చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు... పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)